Breaking News

అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా: కోహ్లి

Published on Tue, 05/06/2025 - 14:16

టీమిండియా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు విరాట్‌ కోహ్లి (Virat Kohli). అయితే, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్‌ పగ్గాలు వదిలేశాడు. అదే ఏడాది తన ఐపీఎల్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) కెప్టెన్‌గానూ కోహ్లి వైదొలిగాడు. ఆ మరుసటి సంవత్సరం టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథిగానూ తప్పుకొన్నాడు.

ఆ తర్వాత కోహ్లి 2.0గా తిరిగొచ్చి ప్రస్తుతం ఇటు టీమిండియా వన్డే, టెస్టు జట్లలో.. అటు ఆర్సీబీలో స్టార్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2025 (IPL 2025)తో బిజీగా ఉన్న ఈ బెంగళూరు ఆటగాడు.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి కారణాల గురించి తాజాగా మాట్లాడాడు.

అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా
ఆర్సీబీ బోల్డ్‌ డైరీస్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకానొక సమయంలో... పరిస్థితులన్నీ కఠినంగా మారిపోయాయి. నా కెరీర్‌లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. అప్పటికి ఏడు- ఎనిమిదేళ్ల నుంచి నేను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాను.

ఆర్సీబీకి తొమ్మిదేళ్లుగా సారథిగా కొనసాగుతున్నాను. ఆ సమయంలో నా బ్యాటింగ్‌ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ నేను బాగా ఆడాలనే ఆకాంక్షలు ఉన్నాయి. కెప్టెన్‌గా ఉన్నా.. బ్యాటర్‌గా కొనసాగినా ఇలాంటివి తప్పదని అర్థమైంది. 24*7 నేను ఎక్స్‌పోజ్‌ అవుతూనే ఉంటా. ఇది నాకు కఠినంగా తోచింది.

పరిస్థితులు నా ఆధీనంలో లేకుండా పోయాయి. అప్పుడే నేను సంతోషంగా ఉండాలని.. నా ఆనందం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాను. వ్యక్తిగత జీవితంలో నా కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉండాలి.

ఆటగాడిగా వచ్చి నా పని పూర్తి చేసి వెళ్తాలి.. నా ఆటను విమర్శించే అవకాశం ఇవ్వకూడదని డిసైడ్‌ అయ్యాను. ఈ సీజన్‌లో జరుగుతున్నది ఇదే’’ అని విరాట్‌ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా అండర్‌-19 క్రికెట్‌లో కెప్టెన్‌గా భారత్‌కు టైటిల్‌ అందించాడు కోహ్లి. ఈ క్రమంలో జాతీయ జట్టులోకి దూసుకువచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్‌.. మహేంద్ర సింగ్‌ ధోని నాయకత్వంలో రాటుదేలాడు.

కెప్టెన్‌గానూ తనదైన ముద్ర
బ్యాటింగ్‌ ఆర్డర్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులెన్నో సాధించాడు. కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో భారత్‌ను విజేతగా నిలపడం కోహ్లి కెరీర్‌లో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.

ఇక భారత జట్టు సారథిగా మూడు ఫార్మాట్లలో కలిపి 213 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఖాతాలో 135 విజయాలు ఉన్నాయి. అదే విధంగా ఆటగాడిగా.. 2008 నుంచి ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20లు పూర్తి చేసుకున్నాడు.

రికార్డుల రారాజు
టెస్టుల్లో 9230, వన్డేల్లో 14181, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. కోహ్లి ఖాతాలో 30 టెస్టు సెంచరీలు, వన్డేల్లో 51 శతకాలు, అంతర్జాతీయ టీ20లలో ఒక సెంచరీ ఉంది. తద్వారా ఓవరాల్‌గా 82 సెంచరీలతో.. శతక శతకాల ధీరుడు సచిన్‌ టెండుల్కర్‌ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లి.

ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్‌ను కూడా దాటేసి అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించాడు కూడా!.. ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 2008 నుంచీ ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి 263 మ్యాచ్‌లలో ఎనిమిది శతకాలతో కలిపి 8509 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌-2025లోనూ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 505 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు.

చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్‌’!.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)