చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

Published on Wed, 01/14/2026 - 15:41

రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి త‌న మార్క్ చూపించ‌లేక‌పోయాడు. తొలి వ‌న్డేలో 93 ప‌రుగులతో సత్తాచాటిన కోహ్లి.. రెండో వ‌న్డేలో మాత్రం నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమితమ‌య్యాడు.

29 బంతుల్లో 23 పరుగులు చేసి క్లార్క్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడనప్పటికి ఓ అరుదైన రికార్డు మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌పై వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాడిగా కింగ్ కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు.

4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కోహ్లి ఇప్పటివరకు కివీస్‌పై వన్డేల్లో 1770 పరుగులుచ చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం​ సచిన్ టెండూల్కర్‌(1750)ను కోహ్లి అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి రెండో స్ధానంలో నిలిచాడు.

అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌(1,971) కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో కోహ్లి కూడా పలు అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంతవేగంగా 28,000 పరుగులు మైలు రాయిని అందుకున్న ప్లేయర్‌గా సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.

అదేవిధంగా ఇంటర్ననేషనల్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2027 లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.
చదవండి: రోహిత్‌ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్‌ కోహ్లి

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)