Breaking News

విరాట్ కోహ్లి వ‌ర‌ల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లోనే

Published on Mon, 09/30/2024 - 16:33

భార‌త స్టార్ క్రికెట‌ర్‌, ర‌న్‌మిషన్ విరాట్ కోహ్లి మ‌రో ప్ర‌పంచ‌రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్యంత‌వేగంగా 27,000 వేల ప‌రుగులు మైలు రాయిని అందుకున్న క్రికెట‌ర్‌గా విరాట్ నిలిచాడు. కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో 47 ప‌రుగులు చేసిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి 594* ఇన్నింగ్స్‌ల‌లో ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

సచిన్ రికార్డు బ్రేక్‌.. 
ఇంతకుముందు ఈ ప్ర‌పంచ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉండేది. సచిన్ 623 ఇన్నింగ్స్‌ల‌లో ఈ ఫీట్‌ను న‌మోదు చేశాడు. 226 టెస్టు, 396 వన్డే, ఒక టీ20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అతడు అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి (594* ) బ్రేక్ చేశాడు.

ఆగ‌ని ర‌న్ మిష‌న్‌..
విరాట్‌ కోహ్లి 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. త‌న అరంగేట్రం నుంచి కోహ్లి స‌త్తాచాటుతునే ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ప‌రుగులు వ‌ర‌ద పారిస్తూ ర‌న్‌మిష‌న్‌గా పేరుగాంచాడు. కోహ్లి ఇప్ప‌టి వ‌ర‌కు టెస్టుల్లో  8871, వన్డేల్లో 13906, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20లో ఒక శతకం కోహ్లి ఖాతాలో ఉన్నాయి.
చదవండి: IND vs BAN: టీమిండియా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)