Breaking News

విరాట్‌ కోహ్లికి అహంకారం ఎక్కువే!

Published on Mon, 06/15/2026 - 15:27

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మైదానంలో ఎలా ఉంటాడో క్రికెట్‌ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి గ్రౌండ్‌లో దిగిన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోతాడు. ప్రత్యర్థి కవ్వింపు చర్యలకు దిగితే వారి శైలిలోనే వారికి సమాధానం చెబుతాడు. స్లెడ్జింగ్‌కు దిగిన వారికి దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇస్తాడు.

ఇక అదే సమయంలో అంతే సరదాగానూ ఉండటం కోహ్లికే చెల్లింది. అయితే, కొంతమంది మాత్రం విరాట్‌ కోహ్లి (Virat Kohli)ని అహంకారి అని.. దూకుడు ఎక్కువని.. అతి చేయడం సరికాదంటూ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఇదే తరహాలో కోహ్లిని విమర్శిస్తూ ఓ పోస్టు ప్రత్యక్షమైంది.

అది నిజమే.. విరాట్‌ కోహ్లి అహంకారి
ఇందుకు టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌, కోహ్లితో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్న రవిశాస్త్రి స్పందించాడు. వన్‌8 చానెల్‌ పోస్ట్‌ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘‘అహంకారి.. అతి గారాబం వల్ల చెడిపోయిన అల్లరిపిల్లాడు. దూకుడు.. కోహ్లి గురించి వాళ్లు అన్న ప్రతీ మాట నిజమే. 

అయితే, ఇదంతా క్రికెట్‌ మైదానంలో ఉన్నంత వరకే. మైదానం వెలుపల కోహ్లి ఇందుకు పూర్తి విభిన్నం. ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం’’ అని రవిశాస్త్రి కోహ్లి పట్ల అభిమానం చాటుకున్నాడు.

ప్రత్యేక అనుబంధం
కాగా రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా.. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా మంచి విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో నంబర్‌ వన్‌గా నిలిచి సత్తా చాటింది. ఈ ఇద్దరు తర్వాతి కాలంలో తమ తమ పదవుల నుంచి వైదొలిగినప్పటికీ.. వారి మధ్య అనుబంధం మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో మరోసారి ఈ విషయం నిరూపితమైంది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఫైనల్‌ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరమయ్యాడు. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ జట్టులోకి వచ్చాడు. ఇక రవిశాస్త్రి ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతూ.. తనదైన శైలి వ్యాఖ్యానంతో అభిమానులను అలరిస్తున్నాడు.

చదవండి: IND vs SL: కొంపముంచేశాడు!

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు