Breaking News

కుల్దీప్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్‌, కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్‌

Published on Wed, 03/22/2023 - 16:36

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌ను డిసైడ్‌ చేసే మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 38 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.

ఇప్పటివరకు హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌లు తలా మూడు వికెట్లు సాధించారు. అక్షర్‌ పటేల్‌ ఓ వికెట్‌ సాధించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి కోపంతో ఊగిపోయారు.

ఏం జరిగిందంటే?
ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 25 ఓవర్‌ వేసిన కుల్దీప్‌ యాదవ్‌.. మూడో బంతికి డేవిడ్‌ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం నాలుగో బంతిని అద్భుతమైన గూగ్లీగా కుల్దీప్‌ సంధించాడు. ఈ క్రమంలో బంతి  క్రీజులోకి వచ్చిన అలెక్స్ కారీ ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు రోహిత్‌, విరాట్‌ ఎల్బీకీ అప్పీలు చేశారు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ మాత్రం నాటౌట్‌ అంటూ తల ఊపాడు.

ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌, స్లిప్‌లో ఉన్న కోహ్లితో చర్చలు జరిపి రివ్యూ తీసుకోనేందుకు సిద్దమయ్యాడు. అయితే బౌలర్‌ కుల్దీప్‌ మాత్రం రోహిత్‌  నిర్ణయాన్ని తిరష్కరిం‍చి బౌలింగ్‌ వేసేందుకు తన స్ధానానికి వెళ్లిపోయాడు. దీంతో కుల్దీప్‌పై రోహిత్‌, కోహ్లి కోపంతో ఊగిపోయారు. అయితే తర్వాతి రిప్లేలో బంతి లెగ్‌స్టంప్‌ను తాకినట్లు కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ICC Rankings: నెం1 ర్యాంక్‌ను కోల్పోయిన సిరాజ్‌.. టాప్‌ ర్యాంక్‌ ఎవరిదంటే?

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)