Breaking News

Vinod Kambli: విడాకులకు సిద్ధమైన భార్య.. ‘తల్లి’ మనసు కరిగి..

Published on Tue, 01/28/2025 - 10:17

కష్టసుఖాల్లో తోడుంటానన్న పెళ్లి నాటి ప్రమాణాలను ఆ భర్త మరిచాడు. తాగుడుకు బానిసై భార్యాబిడ్డలను పట్టించుకోవడమే మానేశాడు. తన చెడువ్యసనాల కారణంగా అనారోగ్యం పాలై ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

భర్త తీరుతో విసిగిపోయిన ఆ భార్య అతడిని వదిలేద్దామనుకుంది. విడాకులు(Divorce) తీసుకోవాలని నిశ్చయించుకుంది. కానీ.. కట్టుకున్న వాడి పరిస్థితి చూసి ఆమె మనసు కరిగిపోయింది. అతడు కూడా ‘బిడ్డ’లాంటి వాడేనంటూ ‘తల్లి’లా మళ్లీ చేరదీసింది. 

తమ ఇద్దరు పిల్లల్లాగే ఇప్పుడు అతడి ఆలనాపాలనా ఆమే చూసుకుంటోంది. నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది. ఆ భార్యాభర్తలు ఆండ్రియా హెవిట్‌(Andrea Hewitt)- వినోద్‌ కాంబ్లీ(Vinod Kambli).

టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్నాళ్లపాటు సత్తా చాటినా.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయాడు ముంబై ప్లేయర్‌ కాంబ్లీ. ఉన్నత శిఖరాలకు చేరుకోగల సత్తా ఉన్నా క్రమశిక్షణా రాహిత్యం వల్ల.. తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నాడనే విమర్శలూ ఉన్నాయి.  

మోడల్‌పై మనసు పారేసుకుని
ఇక వినోద్‌ కాంబ్లీ వ్యక్తిగత జీవితం కూడా అంతగొప్పగా ఏమీ లేదు. తొలుత నొయెల్లా లూయీస్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆమెతో ఎక్కువ కాలం బంధం కొనసాగించలేకపోయాడు. అనంతరం.. ఓ బిల్‌బోర్డుపై ఉన్న యాడ్‌లో కనిపించిన మోడల్‌పై మనసు పారేసుకున్నాడు కాంబ్లీ.

ఆమే ఆండ్రియా హెవిట్‌. ఆమెను నేరుగా కలిసి మనసులోని మాటను చెప్పడంతో పాటు.. పెళ్లికి కూడా ఒప్పించాడు. ఇరువురి అంగీకారంతో 2006లో సివిల్‌ కోర్టులో చట్టబద్దంగా పెళ్లి జరిగింది. వినోద్‌- ఆండ్రియా దాంపత్యానికి గుర్తుగా కుమారుడు జీసస్‌ క్రిస్టియానో కాంబ్లీ, కుమార్తె జొహానా జన్మించారు.

అయితే, పందొమిదేళ్ల వైవాహిక బంధంలో ఆండ్రియా- వినోద్‌ కాంబ్లీ మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. అయితే, వినోద్‌ మద్యపానం, ధూమపానానికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు.. ఒక దశలో ఇంటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడట.

గృహహింస కేసు
అంతేకాదు.. భార్యను వేధించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023లో ఆండ్రియా వినోద్‌ కాంబ్లీపై గృహహింస కేసు పెట్టింది. కుకింగ్‌ ప్యాన్‌తో తనను కొట్టడంతో తలకు గాయమైందని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, ఆ తర్వాత ఇద్దరు కాంప్రమైజ్‌ అయినట్లు సమాచారం.

కానీ వినోద్‌ కాంబ్లీ మాత్రం చెడుఅలవాట్లను వదల్లేదు. ఈ క్రమంలో ఓసారి గుండెపోటుకు గురికావడంతో పాటు..  దాదాపు 14సార్లు పునరావాస కేంద్రానికి వెళ్లినా వ్యసనాల్ని మాత్రం వదల్లేకపోయాడు. దీందో విసుగు చెందిన ఆండ్రియా అతడికి విడాకులు ఇవ్వాలనే నిర్ణయంతో పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. అయితే, అతడి ఆరోగ్య పరిస్థితి చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.

అతడు కూడా నా బిడ్డ లాంటివాడే
ఈ విషయాన్ని తాజాగా ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రియా వెల్లడించింది. ‘‘విడిపోవాలనే ఆలోచన వచ్చింది. అయితే, నేను వదిలేస్తే అతడు ఏమైపోతాడోననే భావన నన్ను నిలవనీయలేదు.

అతడు కూడా నా బిడ్డ లాంటివాడే. అతడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. స్నేహితుల విషయంలోనే నేను చాలా ఎమోషనల్‌గా ఉంటాను. అలాంటిది నా జీవిత భాగస్వామి పట్ల ఇంకెంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోండి.

ఇక విడిపోవాలని అనిపించలేదు
కొన్నిసార్లు తనతో గొడవపడి బయటకు వెళ్లిపోయేదాన్ని. కానీ అతడు భోజనం చేశాడో.. లేదో.. నిద్రపోయాడా లేదంటే ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? అని మళ్లీ వెళ్లి చెక్‌ చేసేదాన్ని. అతడికి నా అవసరం ఉందని గుర్తించిన తర్వాత ఇక విడిపోవాలని అనిపించలేదు’’ అని తల్లి మనసును చాటుకుంది.

నా కుమారుడు అన్నీ అర్థం చేసుకుంటాడు
అయితే, భర్త ప్రవర్తన వల్ల  పిల్లలపై ఈ ప్రభావం పడిందన్న ఆండ్రియా.. ‘‘నా కుమారుడు మాత్రం చిన్న వయసులోనే నా గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అమ్మ మానసిక ఆరోగ్యంతో పాటు.. నాన్నను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తను అప్పుడే డిసైడయ్యాడు’’ అని పేర్కొంది. కాగా ఇటీవలే మరోసారి అనారోగ్యం పాలైన వినోద్‌ కాంబ్లీ ప్రస్తుతం కోలుకున్నాడు. తన భార్య వల్లే ఇది సాధ్యమైందంటూ ఆమెపై ప్రేమను కురిపించాడు. 

చదవండి: పరాయి స్త్రీలను తాకను.. ఇంత పొగరు పనికిరాదు!

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)