మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
World Wrestling Championship 2022: తొలి రౌండ్‌లోనే వినేష్ ఫోగట్ ఓటమి..
Published on Tue, 09/13/2022 - 16:45
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్-2022లో భారత రెజ్లర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఇప్పటికే రెజ్లర్లు సోనమ్ మాలిక్,సుష్మా షోకీన్ ఇంటిముఖం పట్టగా.. తాజాగా భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా ఈ టోర్నీ నుంచి నిష్కమ్రించింది. మంగళవారం జరిగిన మహిళల 53 కేజీల విభాగం తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో వినేష్‌ను మంగోలియాకు చెందిన రెజ్లర్ ఖులాన్ బత్‌ఖుయాగ్ ఓడించింది.
మరోవైపు 50 కేజీల విభాగంలో రెజ్లర్ నీలం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని భారత్‌కు తొలి విజయం అందించింది. తొలి రౌండ్‌లో హంగేరి రెజ్లర్ టైమా స్జెకర్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో నీలం అడుగు పెట్టింది. అదే విధంగా మంగళవారం జరిగిన 65 కేజీల విభాగం తొలి రౌండ్‌లోనే భారత రెజ్లర్ షఫాలీ ఇంటిముఖం పట్టగా.. మరో రెజ్లర్ ప్రియాంక 76 కేజీల విభాగంలో తొలి రౌండ్‌ను దాటలేకపోయింది.
చదవండి: Durnad Cup: సెమీస్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ
Tags : 1