Breaking News

99 పరుగుల వద్ద ఔటైన తిలక్‌ వర్మ

Published on Tue, 12/31/2024 - 18:31

విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25లో హైదరాబాద్‌ ఆటగాడు, టీమిండియా ప్లేయర్‌ తిలక్‌ వర్మ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కర్ణాటకతో ఇవాళ (డిసెంబర్‌ 31) జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ 99 పరుగుల (106 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌) వద్ద ఔటయ్యాడు. కర్ణాటక నిర్దేశించిన 321 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తిలక్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 

తిలక్‌ ఔటైనా వరుణ్‌ గౌడ్‌ సూపర్‌ సెంచరీతో (109 నాటౌట్‌) హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. తిలక్‌ ఔటయ్యాక హైదరాబాద్‌ గెలుపుపై ఆశలు వదులుకుంది. ఈ దశలో వరుణ్‌ గౌడ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. వరుణ్‌ 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. వరుణ్‌ చెలరేగడంతో హైదరాబాద్‌ మరో రెండు బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక.. మయాంక్‌ అగర్వాల్‌ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో నికిన్‌ జోస్‌ 37, కేవీ అనీశ్‌ 11, స్మరణ్‌ రవిచంద్రన్‌ 83, అభినవ్‌ మనోహర్‌ 1, కృష్ణణ్‌ శ్రీజిత్‌ 5, ప్రవీణ్‌ దూబే 24, విద్యాధర్‌ పాటిల్‌ 1, శ్రేయస్‌ గోపాల్‌ 19 (నాటౌట్‌), అభిలాశ్‌ షెట్టి 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. 

హైదరాబాద్‌ బౌలర్లలో చామ మిలింద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. అనికేత్‌ రెడ్డి 2, ముదస్సిర్‌, రోహిత్‌ రాయుడు తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్‌ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. వరుణ్‌ గౌడ్‌ అద్భుతమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. 

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో తన్మయ్‌ అగర్వాల్‌ 35, రోహిత్‌ రాయుడు 0, హిమతేజ 15, నితేశ్‌ రెడ్డి 0, అరవెల్లి అవనీశ్‌ 17, తనయ్‌ త్యాగరాజన్‌ 25, చామ మిలింద్‌ 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్‌ దూబే, నికిన్‌ జోస్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. అభిలాశ్‌ శెట్టి, విద్యాధర్‌ పాటిల్‌, శ్రేయస్‌ గోపాల​్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

మయాంక్‌ హ్యాట్రిక్‌ సెంచరీస్‌
ప్రస్తుతం జరుగుతున్న విజయ్‌ హజారే ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్  హ్యాట్రిక్‌ సెంచరీలు సాధించాడు. డిసెంబర్‌ 26న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 127 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 139 పరుగులు చేసిన మయాంక్‌.. డిసెంబర్‌ 28న అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. ఇవాళ (డిసెంబర్‌ 31) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మయాంక్‌ మరో సెంచరీ చేసి హ్యాట్రిక్‌ సెంచరీలు నమోదు చేశాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)