Breaking News

‘శత’క్కొట్టిన అథర్వ తైడే.. చాంపియన్‌ విదర్భ

Published on Mon, 01/19/2026 - 09:08

సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన విదర్భ జట్టు తొలిసారి విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్‌ ఆసాంతం రాణించిన విదర్భ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ విజేతగా నిలిచింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో మాజీ చాంపియన్‌ సౌరాష్ట్రపై గెలుపొందింది. 

‘శత’క్కొట్టిన అథర్వ తైడే.. 
గతేడాది తుదిమెట్టుపై బోల్తా పడ్డ విదర్భ... ఈసారి పట్టు వదలకుండా ప్రయత్నించి విజయవంతమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్‌ అథర్వ తైడే (118 బంతుల్లో 128; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... యశ్‌ రాథోడ్‌ (61 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. 

అమన్‌ మోఖడే (33), రవికుమార్‌ సమర్థ్‌ (25) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో 213/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించిన విదర్భ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ హర్ష్‌ దూబే (17), మొహమ్మద్‌ ఫైజ్‌ (19) ఎక్కువసేపు నిలవలేకపోయారు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్‌ పన్వర్‌ 4 వికెట్లు పడగొట్టగా... చేతన్‌ సకారియా, చిరాగ్‌ జానీ చెరో రెండు వికెట్లు తీశారు. 

279 పరుగులకు ఆలౌట్‌
అనంతరం ఛేదనలో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్‌ మన్కడ్‌ (92 బంతుల్లో 88; 10 ఫోర్లు), చిరాగ్‌ జానీ (63 బంతుల్లో 64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. కెపె్టన్‌ హార్విక్‌ దేశాయ్‌ (20), విశ్వరాజ్‌ జడేజా (9), పర్‌స్వరాజ్‌ రాణా (7) విఫలమయ్యారు. 

విదర్భ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌ 4 వికెట్లు పడగొట్టగా... నచికేత్‌ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. విదర్భ ప్లేయర్లు అథర్వ తైడేకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, అమన్‌ మోఖడేకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు, ఆంధ్ర మాజీ క్రికెటర్‌ చాముండేశ్వరనాథ్‌ విదర్భ జట్టుకు విన్నర్స్‌ ట్రోఫీ అందించారు.    

చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్‌ మిచెల్‌..

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)