Breaking News

హ్యాట్రిక్‌ సెంచరీల వీరుడికి షాక్‌.. వరుణ్‌ వీరోచిత శతకంతో..

Published on Wed, 01/01/2025 - 08:49

దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు అనూహ్య విజయం సాధించింది. భారీ లక్ష్యం ముందున్నా... ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడిన గెలుపును సొంతం చేసుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా మంగళవారం కర్ణాటక జట్టుపై మూడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది.

చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో హైదరాబాద్‌ రెండు బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. వరుణ్‌ గౌడ్‌ (82 బంతుల్లో 109 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ శతకంతో హైదరాబాద్‌ జట్టును గెలిపించాడు.

మయాంక్‌ అగర్వాల్‌ హ్యాట్రిక్‌ సెంచరీ
టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న కర్ణాటక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (112 బంతుల్లో 124; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఈ సీజన్‌లో అతడికి వరుసగా ఇది మూడో శతకం. మరోవైపు.. స్మరణ్‌ (75 బంతుల్లో 83; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

తిలక్‌ వర్మ @99
ఇక హైదరాబాద్‌ బౌలర్లలో చామా మిలింద్‌ 3 వికెట్లు పడగొట్టగా... అనికేత్‌ రెడ్డి 2 వికెట్లు తీశాడు. ముదస్సిర్, రోహిత్‌ రాయుడులకు ఒక్కో వికెట్‌ లభించింది. 

కాగా లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ 49.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ తిలక్‌ వర్మ (106 బంతుల్లో 99; 7 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా... వరుణ్‌ గౌడ్‌ వీరవిహారం చేశాడు.

వరుణ్‌ వీరోచిత శతకం
తిలక్, వరుణ్‌ ఐదో వికెట్‌కు 112 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టారు. కీలక సమయంలో తిలక్‌ వెనుదిరిగినా... చివరి వరకు క్రీజులో నిలిచిన వరుణ్‌ గౌడ్‌ భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు. తనయ్‌ త్యాగరాజన్‌ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్‌), వరుణ్‌ ఏడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.

చివరి ఓవర్‌ తొలి బంతికి తనయ్‌ అవుటైనా... చామా మిలింద్‌ (4 నాటౌట్‌)తో కలిసి వరుణ్‌ హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చాడు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్‌ దూబే, నికిన్‌ జోస్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

ఇక ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 109 నాటౌట్‌గా నిలిచి హైదరాబాద్‌ను గెలిపించిన వరుణ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. తమ తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం పంజాబ్‌తో హైదరాబాద్‌ ఆడుతుంది. 

చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్‌ పఠాన్‌ 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)