Breaking News

భారీ సెంచరీతో కదం తొక్కిన జడేజా

Published on Sat, 01/17/2026 - 08:04

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర ఫైనల్స్‌కు చేరింది. నిన్న (జనవరి 16) జరిగిన రెండో సెమీఫైనల్లో పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, జనవరి 18న జరిగే ఫైనల్లో విదర్భతో అమీతుమీకి సిద్దమైంది.

ఓపెనర్‌ విశ్వరాజ్‌ జడేజా అజేయ శతకంతో చెలరేగి సౌరాష్ట్రను ఒంటిచేత్తో గెలిపించాడు. 127 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 165 పరుగులు చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. జడేజాకు గత మూడు మ్యాచ్‌ల్లో ఇది రెండో శతకం.  

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 50 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (87) పవర్‌ప్లేలోనే విధ్వంసం (9 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించాడు. అనంతరం అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (105 బంతుల్లో 100) అద్భుతమైన శతకం సాధించాడు. అయితే మధ్యలో నమన్‌ ధీర్‌, నేహల్‌ వాధేరా వరుసగా ఔట్‌ కావడంతో పంజాబ్‌ రన్‌రేట్‌ దెబ్బతింది. చివర్లో రమన్‌దీప్‌ సింగ్‌తో కలిసి అన్మోల్‌ప్రీత్‌ కొన్ని బౌండరీలు సాధించినా, చేతన్‌ సకారియా (4/60) ధాటికి దిగువ వరుస కూలిపోయింది.  

అనంతరం 292 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్లు జడేజా, హర్విక్‌ దేశాయ్‌ (64) శుభారంభాన్ని అందించారు. పవర్‌ప్లేలోనే వీరు 92 పరుగులు సాధించి పంజాబ్‌ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. 20 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు  స్కోరు 151/0కి చేరింది. అప్పటికే మ్యాచ్‌ దాదాపు సౌరాష్ట్ర వైపు మళ్లింది. దేశాయ్‌ ఔటైన తర్వాత కూడా జడేజా తన దూకుడు కొనసాగించాడు. కేవలం 74 బంతుల్లో శతకం పూర్తి చేసి, తర్వాత మరింత వేగంగా ఆడాడు.  

హార్విక్‌ ఔటయ్యాక వచ్చిన ప్రేరక్‌ మాంకడ్‌ (52*) కూడా జడేజాకు తోడుగా బౌండరీల వర్షం కురిపించాడు. ఫలితంగా సౌరాష్ట్ర 39.3 ఓవర్లలోనే వికెట్‌ మాత్రమే కోల్పోయి గెలుపు తీరాలు చేరింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)