Breaking News

పడిక్కల్‌ వీరోచిత పోరాటం.. ఇషాన్‌ కిషన్‌ సుడిగాలి శతకం వృధా

Published on Wed, 12/24/2025 - 18:30

విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ 2025-26లో తొలి రోజే అద్భుతాలు జరిగాయి. ఇవాళ ఒక్క రోజు లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో టాప్‌-8లోని మూడు ఫాస్టెస్ట్‌ సెంచరీలు నమోదయ్యాయి. బిహార్‌ ఆటగాడు సకీబుల్‌ గనీ 32 బంతుల్లో శతక్కొట్టి, లిస్ట్‌-ఏలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా అవతరించగా.. ఝార్ఖండ్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ 33 బంతుల్లో, వైభవ్‌ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీలు పూర్తి చేసి లిస్ట్‌-ఏ క్రికెట్‌లో నాలుగు, ఎనిమిదో ఫాస్టెస్ట్‌ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు.

వీరు మాత్రమే కాక ఇవాళే మరో ముగ్గురు స్టార్ బ్యాటర్లు కూడా సెంచరీలు చేశారు. టీమిండియా వెటరన్‌ స్టార్లు రోహిత్‌ శర్మ (ముంబై), విరాట్‌ కోహ్లి (ఢిల్లీ).. అప్‌కమింగ్‌ స్టార్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (కర్ణాటక) శతక్కొట్టుడు కొట్టారు. ఇవాళే ఓ అనామక ఆటగాడు డబుల్‌ సెంచరీ కూడా చేశాడు. ఒడిషాకు చెందిన స్వస్తిక్‌ సమల్‌ సౌరాష్ట్రపై ఈ ఫీట్‌ సాధించాడు. మొత్తంగా విజయ్‌ హజారే ట్రోఫీ 2025-25 ఎడిషన్‌ తొలి రోజు శతకాల మోత (22) మోగింది. 

పడిక్కల్‌ వీరోచిత పోరాటం.. ఇషాన్‌ కిషన్‌ 33 బంతుల శతకం వృధా
ఇదిలా ఉంటే, ఇవాళ కర్ణాటకపై ఇషాన్‌ కిషన్‌ చేసిన 33 బంతుల శతకం వృధా అయ్యింది. ఇషాన్‌ కిషన్‌ శతక్కొట్టుడు కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ఝార్ఖండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 412 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. దేవదత్‌ పడిక్కల్‌ వీరోచితంగా పోరాడి కర్ణాటకకు చారిత్రక​ విజయాన్ని అందించాడు. 

భారీ లక్ష్య ఛేదనలో పడిక్కల్‌ 118 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 147 పరుగులు చేసి కర్ణాటకను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. ఆతర్వాత అభినవ్‌ మనోహర్‌ (56 నాటౌట్‌), ధృవ్‌ ప్రభాకర్‌ (40 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి కర్ణాటకను గెలుపు తీరాలు దాటించారు. 

లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో ఇది రెండో భారీ లక్ష్య ఛేదనగా.. విజయ్‌ హజారే టోర్నీ చరిత్రలో భారీ లక్ష్య ఛేదనగా రికార్డైంది. లిస్ట్‌-ఏ క్రికెట్‌ చరిత్రలో అతి భారీ లక్ష్య ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా 435 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

 

 

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)