Breaking News

#venkateshIyer: నొప్పిని భరిస్తూనే..

Published on Sun, 04/16/2023 - 18:22

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రెడో శతకం నమోదైంది. కేకేఆర్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. 49 బంతుల్లో 9 సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్‌ అందుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌కు ఇదే తొలి ఐపీఎల్‌ సెంచరీ కావడం విశేషం.

అయితే ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో వెంకటేశ్‌ అయ్యర్‌ స్కూప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలింది. కామెరాన్‌ గ్రీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4 ఓవర్‌లో గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన డెలివరీని స్కూప్‌ ఆడే ప్రయత్నంలో బంతి మోకాలికి గట్టిగా తగిలింది. దీంతో వెంకటేశ్‌ అయ్యర్‌ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో ఫిజియో వచ్చి పరిశీలించి చికిత్స చేశాడు. అయితే అదే సమయంలో ముంబై ఆటగాడు తిలక్‌ వర్మ వెంకటేశ్‌ అయ్యర్‌ కాలికి మర్దన చేసి క్రీడాస్పూర్తిని చాటుకోవడం విశేషం. 

ఇక నొప్పి బాధిస్తున్నా వెంకటేశ్‌ అయ్యర్‌ తన దూకుడును ఏమాత్రం ఆపలేదు. చూస్తుండగానే ఫిఫ్టీ మార్క్‌ అందుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌.. 90 పరుగులకు చేరుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. అయితే 90 నుంచి వంద మార్క్‌ అందుకోవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సింగిల్స్‌ తీస్తూ సెంచరీకి చేరువయ్యాడు.

ఈ క్రమంలో అతను నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. అయితే గాయం పెద్దగా లేకపోవడం ఊరట అని చెప్పొచ్చు. బంతి కాలికి బలంగా తగలడంతో నొప్పి కాస్త ఎక్కువే ఉందని.. ఎలాగూ ఇంపాక్ట్‌ కింద డగౌట్‌ కూర్చుంటా కాబట్టి నొప్పి తగ్గే అవకాశం ఉంది. అని తొలి ఇన్నింగ్స్‌ అనంతరం చెప్పుకొచ్చాడు.

చదవండి: Nitish Rana Vs Hrithik Shokeen: గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)