Breaking News

టీమిండియాకు భారీ షాక్‌

Published on Sun, 06/21/2026 - 17:16

అఫ్గానిస్తాన్‌తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసి మంచి జోష్‌లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌-2026లో ఎడమ కాలి గాయం బారిన పడిన వరుణ్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.

అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI COE)లో కోలుకుంటున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. అయితే వరుణ్ చక్రవర్తి రీప్లేస్‌మెంట్‌ను ఇంకా భార‌త క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించ‌లేదు. 

ప్ర‌స్తుత ప‌రిస్థితుల బ‌ట్టి చ‌క్ర‌వ‌ర్తి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు కూడా దూర‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. వ‌రుణ్ స్ధానంలో హ‌ర్ష్ దూబే లేదా కుల్దీప్‌ యాదవ్‌ను ఎంపిక చేసే అవ‌కాశ‌ముంది. దూబే అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌లో ఆక‌ట్టుకున్నాడు. కాగా  భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ జూన్ 26 నుంచి జరగనుంది. 

మ‌రోవైపు ఇంగ్లండ్‌తో వ‌న్డేల‌కు కూడా భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లి, జ‌స్ప్రీత్ బుమ్రాలు తిరిగొచ్చారు. కానీ య‌శ‌స్వి జైశ్వాల్‌, సిరాజ్‌కు మాత్రం జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు (అప్‌డేట‌డ్‌):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్-కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇంగ్లండ్‌తో వ‌న్డేల‌కు భార‌త‌ జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గూరనూర్ బ్రార్.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి