Breaking News

IND Vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌

Published on Thu, 11/14/2024 - 07:50

సౌతాఫ్రికా గ‌డ్డ‌పై టీమిండియా ఆఫ్ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మ‌రోసారి అద‌ర‌గొట్టాడు. బుధ‌వారం సెంచూరియ‌న్ వేదిక‌గా స‌ఫారీల‌తో జ‌రిగిన మూడో టీ20లో రెండు వికెట్ల‌తో స‌త్తాచాటాడు. గ‌త రెండు మ్యాచ్‌ల‌తో పోలిస్తే ప‌రుగులు కాస్త ఎక్కువ‌గా ఇచ్చిన‌ప్ప‌టికీ రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్‌కు మ‌రో విజ‌యాన్ని అందించాడు.

ఓపెన‌ర్ రీజా హెండ్రిక్స్‌, కెప్టెన్ ఐడైన్ మార్‌క్ర‌మ్‌ల‌ను సరైన స‌మ‌యంలో పెవిలియ‌న్‌కు పంపి మ్యాచ్‌ను భార‌త్ వైపు మ‌లుపు తిరిగేలా చేశాడు. ఈ క్ర‌మంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి  ఓ అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు.

అశ్విన్‌ రికార్డు బద్దలు...
ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా వ‌రుణ్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ తమిళనాడు స్టార్ స్పిన్నర్ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

తద్వారా ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట వరుణ్ లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్‌ 9 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును చక్రవర్తి బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో భారత్‌ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్‌ దూసుకెళ్లింది.
చదవండి: IND vs AUS: ప్రాక్టీస్‌ మొదలైంది
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి