అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్
Published on Sun, 06/08/2025 - 11:07
ఐపీఎల్-2025లో విధ్వంసం సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న సూర్యవంశీ.. భారత అండర్-19 జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు సన్నద్దమవుతున్నాడు.
తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 14 ఏళ్ల చిచ్చరపిడుగు సిక్సర్ల వర్షం కురిపించాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అద్బుతమైన షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక తన ఐపీఎల్ అరంగేట్రంలో సూర్యవంశీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఔరా అన్పించాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసిన సూర్యవంశీ.. ఈ ఘనత అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ.. 206.55 స్ట్రైక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు.
ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. ఇక భారత అండర్-19 జట్టు ఈ నెల ఆఖరిలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ అండర్-19 టీమ్‌తో కలిసి ఐదు వన్డే, రెండు మల్టీ- డే మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 24 నుంచి భారత యువ జట్టు ఇంగ్లండ్ టూర్ ప్రారంభం కానుంది. ఈ జట్టుకు సీఎస్కే యువ ఆటగాడు ఆయూష్ మాత్రే సారథ్యం వహించనుండగా.. సూర్యవంశీ సభ్యునిగా చోటు దక్కించుకున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 పురుషుల జట్టు
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).
భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లండ్ అండర్-19: 2025 షెడ్యూల్
👉జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ గేమ్- లోబోరో యూనివర్సిటీ
👉జూన్ 27- తొలి వన్డే- హోవ్
👉జూన్ 30- రెండో వన్డే- నార్తాంప్టన్
👉జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్
👉జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్
👉జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్
👉జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్- బెకింగ్‌హామ్
👉జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్- చెమ్స్‌ఫోర్డ్.
Vaibhav Suryavanshi is smashing bowler at U19 HP NCA camp.🔥
He is high on confidence after successful IPL stint pic.twitter.com/ZyLkNJrVy9— Varun Giri (@Varungiri0) June 6, 2025
Tags : 1