Breaking News

అరంగేట్రంలో అదుర్స్‌.. 5 వికెట్లతో చెలరేగిన వైభవ్ టీమ్ మేట్‌

Published on Tue, 08/05/2025 - 18:14

ఢిల్లీ ప్రీమియర్ ‍లీగ్ నుంచి మరో యువ సంచలనం క్రికెట్ ప్రపంచానికి పరిచియమయ్యాడు. 18 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ఉదవ్ మోహన్ తన డీపీఎల్ అరంగేట్రంలోనే సత్తాచాటాడు. ఈ మెగా టోర్నీలో పురానీ దిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మోహన్‌.. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఔటర్ ఢిల్లీతో జరిగిన ‍మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగాడు. 

మోహన్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మోహిత్ పన్వర్, ధ్రువ్ సింగ్, సిద్ధాంత్ శర్మ , హర్ష్ త్యాగి, శివమ్ శర్మ వంటి కీలక వికెట్లను మోహన్ సాధించాడు.

ఉదవ్  ఇటీవలే భారత అండర్‌-19 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. వచ్చే  నెలలో ఆస్ట్రేలియా అండర్‌-19తో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్‌లలో వైభవ్ సూర్యవంశీ, అయూష్ మాత్రేతో కలిసి మోహన్ ఆడనున్నాడు.  మోహన్ ఇంకా ఫస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేయలేదు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో అతడిని పురానీ దిల్లీ రూ. 6.60 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది.  తన ధరకు తగ్గ న్యాయం తొలి మ్యాచ్‌లోనే మోహన్ చేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. పురానీ దిల్లీపై 82 ప‌రుగుల తేడాతో ఔట‌ర్ ఢిల్లీ వారియ‌ర్స్ విజ‌యం సాధించింది. 149 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో పురానీ దిల్లీ 66 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఔట‌రీ ఢిల్లీ బౌల‌ర్ల‌లో సుయూష్ శ‌ర్మ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. శౌర్య మాలిక్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ వారియ‌ర్స్ 148 ప‌రుగుల‌కు ఆలౌటౌటైంది. పురానీ ధిల్లీ బౌల‌ర్ల‌లో మోహ‌న్‌తో పాటు ప్ర‌షార్‌, దాద‌ర్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

చదవండి: Stuart Broad: టీమిండియా నుంచి ఆరుగురు.. గిల్‌కు చోటు లేదు!

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)