Breaking News

IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభ‌వ్‌.. నిన్నే న‌మ్ముకున్నాముగా

Published on Sat, 07/12/2025 - 16:50

ఇంగ్లండ్ అండ‌ర్‌-19తో  యూత్ టెస్టు సిరీస్‌ను భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ(Vaibhav Suryavanshi) పేల‌వంగా ఆరంభించాడు. కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ వేదిక‌గా తొలి యూత్ టెస్టులో భార‌త్ అండ‌ర్‌-19, ఇంగ్లండ్ అండ‌ర్‌-19 జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి.

అయితే వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఈ తొలి టెస్టులో మాత్రం నిరాశ‌ప‌రిచాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో 13 బంతులు ఎదుర్కొన్న సూర్య‌వంశీ.. మూడు ఫోర్ల సాయంతో కేవ‌లం 14 పరుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

ఇంగ్లండ్ పేస‌ర్ అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో అల్బర్ట్‌కు క్యాచ్ ఇచ్చి త‌న వికెట్‌ను వైభ‌వ్ కోల్పోయాడు.  అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎంత పనిచేశావు వైభవ్, నిన్నే నమ్ముకున్నాముగా అంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.12 ఓవర్లు ముగిసే సరికి భారత అండర్‌-19 జట్టు వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో విహాన్ మల్హోత్రా(6), ఆయూష్ మాత్రే(18) ఉన్నారు.

వ‌న్డేల్లో విధ్వంసం..
ఈ సిరీస్‌కు ముందు ఆతిథ్య ఇంగ్లండ్‌తో జ‌రిగిన యూత్ వ‌న్డేల్లో వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు.తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్‌ రాబట్టాడు. ఇక మూడో యూత్‌ వన్డేల్లో ఈ బిహార్ ఆటగాడు కేవలం 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అనంతరం నాలుగో వన్డేలో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు

52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్‌ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఐదు వన్డేల్లో ఓవరాల్‌గా 29 సిక్సర్లు బాది 355 పరుగులు సాధించాడు. కాగా ఐపీఎల్‌లో ఈ యువ సంచలనం రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తుది జట్లు
ఇంగ్లండ్ U19 (ప్లేయింగ్ XI): జైద్న్ డెన్లీ, ఆర్చీ వాఘన్, హంజా షేక్(కెప్టెన్‌), రాకీ ఫ్లింటాఫ్, బెన్ మేయెస్, థామస్ రెవ్(వికెట్‌), ఎకాన్ష్ సింగ్, రాల్ఫీ ఆల్బర్ట్, జాక్ హోమ్, జేమ్స్ మింటో, అలెక్స్ గ్రీన్

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆయుష్ మ్త్రే(కెప్టెన్‌), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్‌),  అంబరీష్, మహ్మద్ ఈనాన్, దీపేష్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, అన్మోల్జీత్ సింగ్
చదవండి: #Pat Cummins: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ కీల‌క నిర్ణ‌యం..
 

 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)