సూర్య‌వంశీ సుడిగాలి ఇన్నింగ్స్‌.. గుజ‌రాత్‌కు రాజ‌స్తాన్ షాక్‌

Published on Mon, 04/28/2025 - 23:21

ఐపీఎల్‌-2025లో జైపూర్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జూలు విధిల్చింది. ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్‌ను 8 వికెట్ల తేడాతో రాజ‌స్తాన్ చిత్తు చేసింది.  ఈ విజ‌యంతో రాజ‌స్తాన్ త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. 210 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని రాజ‌స్తాన్ కేవ‌లం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవ‌ర్లలో చేధించింది. 

రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. కేవ‌లం 35 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచ‌రీని అందుకున్నాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన రెండో ఆట‌గాడిగా 14 ఏళ్ల వైభ‌వ్ రికార్డుల‌కెక్కాడు. ఓవరాల్‌గా 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. అత‌డితో పాటు య‌శ‌స్వి జైశ్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 70 నాటౌట్‌) సైతం కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. గుజ‌రాత్ బౌల‌ర్లు పూర్తిగా తేలిపోయారు. ప్రసిద్ద్‌, ర‌షీద్ ఖాన్ మాత్ర‌మే చెరో వికెట్ సాధించారు.

గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌..
అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్ మరోసారి తన బ్యాట్‌కు పని చెప్పాడు. 50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. అతడితో పాటు బట్లర్‌(50), సాయిసుదర్శన్‌(39) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో థీక్షణ రెండు, అర్చర్‌, సందీప్ శర్మ తలా వికెట్ సాధించారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)