Breaking News

మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం

Published on Thu, 06/11/2026 - 11:04

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. శ్రీలంక-ఎతో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమై వైభవ్.. రెండో మ్యాచ్‌లో తనదైన శైలిలో వీరవిహారం చేశాడు. భారత్‌-ఎ తరపున బరిలోకి సూర్యవంశీ.. అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

ఈ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా  అఫ్గాన్ పేసర్ మహమ్మద్ ఇబ్రహీంను వైభవ్ టార్గెట్ చేశాడు. పవర్‌ప్లేలో అతడు వేసిన మూడు ఓవర్లలోనూ పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్‌ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.

15 ఏళ్ల వైభవ్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. కాగా ఈ యువ సంచలనం ఇటీవల ఇర్లాండ్‌, ఇంగ్లండ్‌, ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక  ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భార‌త్ త‌మ తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు చేయ‌లేదు.

తుది జట్లు
అఫ్గానిస్తాన్‌A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్‌),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్‌జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్‌ కీపర్‌), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీ

ఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్‌కీపర్‌), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్‌), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్
చదవండి: MPL 2026: స‌న్‌రైజ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్ విధ్వంసం.. కేవ‌లం 17 బంతుల్లోనే




 

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)