Breaking News

ఎందుకు అలా చేశావు.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్!

Published on Thu, 06/11/2026 - 13:53

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ జాతీయ జ‌ట్టుకు ఎంపికైన త‌ర్వాత తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌-ఎ తరపున వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకపై విఫలమైనప్పటికి అఫ్గాన్‌పై మాత్రం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

15 ఏళ్ల సూర్యవంశీ తనదైన శైలిలో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే 200 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతడు దూకుడు చూసి సెంచరీ బాదడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా వైభవ్ మలుచుకోలేకపోయాడు.

చెత్త షాట్ ఆడి..
కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి. తనకు ఉన్న ఏకైక వీక్‌నెస్ ఈ మ్యాచ్‌లోనూ బయటపడింది.  'షార్ట్ ఆఫ్ ఎ లెంగ్త్' బంతికి మరోసారి తన వికెట్‌ను కోల్పోయాడు. ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్‌జాయ్ టీమిండియా ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన అబ్దుల్లా అహ్మద్‌జాయ్.. తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అతడు రాంప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.

కానీ ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా బంతి అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది. అసలు ఆ బంతికి ఆ షాట్‌ ఆడాల్సిన అవసరం లేదు. కానీ అనవసరంగా లేని షాట్‌ను ఆడి తన హాఫ్‌ సెంచరీని కోల్పోయాడు. ఐపీఎల్‌-2026లోనూ చాలా మ్యాచ్‌లలో షార్ట్ లెంగ్త్ బంతికే వైభవ్‌ ఔటయ్యాడు. అతడి బలహీనతను పసిగట్టిన అఫ్గాన్‌ పేసర్‌.. ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేసి బోల్తా కొట్టించాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)