Breaking News

వైభ‌వ్‌కు టాటా ల‌గ్జ‌రీ కారు గిఫ్ట్‌.. ధ‌ర ఎంతంటే?

Published on Tue, 02/24/2026 - 20:12

బిహార్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో క్రికెట్ ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. 14 ఏళ్ల వైభ‌వ్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌-2025లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన వైభ‌వ్‌.. త‌న సంచ‌ల‌న బ్యాటింగ్‌తో వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్ల‌ను సైతం వ‌ణికించాడు.

కేవ‌లం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే సెంచ‌రీ చేసి త‌న పేరును ఐపీఎల్ చ‌రిత్ర‌లో సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచ‌రీ చేసిన అత్యంత పిన్న వ‌య‌ష్కుడిగా వైభ‌వ్ నిలిచాడు. అత‌డు 206.56 స్ట్రైక్ రేట్‌తో కేవ‌లం 7 మ్యాచ్‌ల్లోనే 252 ప‌రుగులు చేశాడు. 

దీంతో వైభ‌వ్ “ టాటా కర్వ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్” అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా  టాటా మోటార్స్ అతనికి ప్రత్యేక బహుమతిగా కొత్త టాటా కర్వ్ SUV కారును అందించింది. వైభవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను టాటా మోటార్స్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా టాటా కర్వ్ టాప్ మోడల్ ఆన్-రోడ్ ధర ఢిల్లీలో రూ. 22 లక్షలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఈ కారు అత్యాధునికమైన డీజిల్ ఇంజిన్ ,డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ వంటి ఫ్యూచ‌ర్స్ క‌లిగి ఉంది.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)