Breaking News

వైభవ్‌ సూర్యవంశీ అట్టర్‌ ఫ్లాప్‌

Published on Thu, 07/09/2026 - 23:01

టీమిండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. బ్రిస్టల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో వైభవ్‌ మరోసారి నామమాత్రపు స్కోర్‌కే పరిమితమయ్యాడు. రెండో టీ20 మాదిరే షార్ట్‌ పిచ్‌ డెలివరీకి వైభవ్‌ దొరికిపోయాడు.

తొలి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌ను ఆచితూచి ఆడిన వైభవ్‌.. రెండో ఓవర్‌ వేసిన జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోర్‌, సిక్స్‌ బాది తన రిథమ్‌ను అందుకున్నాడు. కానీ తర్వాత ఓవర్‌లో ఆర్చర్‌ వేసిన షార్ట్‌ లెంగ్త్‌ బంతికి భారీ షాట్‌ ఆడబోయి వైభవ్‌ ఔటయ్యాడు.

షార్ట్‌ లెంగ్త్‌ బంతిని  'పుల్' షాట్ ఆడేందుకు సూర్యవంశీ ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది.  మిడ్-ఆన్ వద్ద ఉన్న సామ్‌ కుర్రాన్‌ సునాయస క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 10 బంతుల్లో ఒక ఫోర్, సిక్స్‌తో కేవలం 15 పరుగులు చేసి వైభవ్‌ ఔటయ్యాడు.

వైభవ్‌ గత రెండు మ్యాచ్‌లలో 14, 13 స్కోర్లను నమోదు చేశాడు. మొత్తంగా తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో మొదటి మూడు మ్యాచ్‌లలో 42 పరుగులు చేశాడు. కాగా వైభవ్‌కు ఛాన్స్‌ ఇవ్వడం కోసం స్టార్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను సైతం పక్కన పెట్టారు. కానీ వైభవ్‌ మాత్రం తన లభించిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నాడు.


 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)