Breaking News

Vaibhav Suryavanshi: ఫోన్‌ ఆన్‌ చేయగానే 500 మిస్స్‌డ్‌ కాల్స్‌

Published on Thu, 05/22/2025 - 03:37

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌ నుంచి రాజస్తాన్‌ రాయల్స్‌ నిష్క్రమించి ఉండొచ్చు. కానీ ఒక కుర్రాడి ఆగమనం మాత్రం అద్వితీయంగా మలిచింది ఆ ఫ్రాంచైజీ! 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ 18 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం రాజస్తాన్‌కు కోచింగ్‌ ఇవ్వడం... ముఖ్యంగా కుర్రాళ్లను సానబెట్టడంతో దిట్టయిన ద్రవిడ్‌ సూచనలు, హెచ్చరికలు వైభవ్‌పై మంచి ప్రభావమే చూపాయి. 

బ్యాటింగ్‌పైనే ధ్యాస పెట్టమని, ఎప్పుడైనా సరే చురుకుదనంతో అందుబాటులో ఉండాలనే హెచ్చరికలు తనను ఆటపైనే దృష్టి కేంద్రీకరించేలా చేశాయని స్వయంగా వైభవ్‌ చెప్పుకొచ్చాడు. గుజరాత్‌ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసిన సందర్భంలో తన ఫోన్‌కు ఏకంగా 500 పైచిలుకు మిస్స్‌డ్‌ కాల్స్‌ వచ్చాయని చెప్పాడు. ద్రవిడ్‌ సూచనలతో ఆటపై ఫోకస్‌ చేసేందుకు ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేయగా సెంచరీ తర్వాత ప్రశంసించేందుకు అన్ని కాల్స్‌ వచ్చినట్లు వైభవ్‌ చెప్పాడు. 

‘మూణ్నాలుగు నెలలుగా నేను పడుతున్న కష్టానికి ఫలితం వచ్చింది. అదేపనిగా ప్రాక్టీస్‌లో నా బలహీనతల్ని అధిగమించడం వల్లే మ్యాచ్‌ల్లో ఆడటం సులువైంది. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం ఎలాగో నేర్చుకున్నాను. జట్టు విజయానికి అవసరమైన బ్యాటింగ్‌ శైలీని అలవర్చుకున్నా. నా బలమెంటో నాకు తెలుసు. జట్టుకేం కావాలనేది అప్పటి పరిస్థితులకు తెలుసు. వీటిని దృష్టిలో ఉంచుకొని రాణించాలి’ అని రాయల్స్‌ హెడ్‌కోచ్‌ ద్రవిడ్‌తో పాల్గొన్న వీడియోలో వైభవ్‌ చెప్పాడు. 

ఈ వీడియోను ఐపీఎల్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా టీనేజ్‌ సంచలనాన్ని అభినందించిన ద్రవిడ్‌ అసలైన సవాళ్లు ముందున్నాయని అతనికి గుర్తు చేశాడు. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లాడిన సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. 206.56 స్ట్రయిక్‌ రేట్‌తో 36 సగటును నమోదు చేశాడు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)