Breaking News

డేల్ స్టెయిన్‌కే బౌలింగ్ పాఠాలు నేర్పిన కుర్రాడు... వీడియో

Published on Fri, 06/07/2024 - 13:40

తాతకు దగ్గులు నేర్పడం అంటే ఇదేనేమో... ద క్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ తెలుసుగా.... ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని బౌలర్లలో ఒకడు. వేసిన బంతి బుల్లెట్‌ లా దూసుకుపోవాల్సిందే..వికెట్‌ తీయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది స్టెయిన్‌ బౌలింగ్‌. ఈ ప్రతిభే అతడికి అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తెచ్చిపెట్టింది కూడా. మరి.. ఇలాంటి బౌలర్‌కు ఓ కుర్రాడు బౌలింగ్‌ పాఠాలు చెబితే ఎలా ఉంటుంది? కిందనున్న వీడియో చూస్తే తెలుస్తుంది. 
2021 ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న స్టెయిన్ ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్‌లలోజరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌-2024లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల షాపింగ్‌ మాల్స్‌లలో ఏర్పాటు చేసే నెట్‌ క్రికెట్‌ స్టాల్‌ వద్దకు స్టెయిన్‌ చేరుకున్నాడు. అక్కడున్న కుర్రాడికేమో స్టెయిన్‌ ఎవరో తెలియదు. అతడి గొప్పతనమూ ఆ కుర్రాడికి తెలియలేదు. అందరు కస్టమర్ల మాదిరిగానే క్రికెట్‌ ఆడేందుకు వచ్చాడనుకున్నాడు. బంతి ఎలా పట్టుకోవాలన్న దగ్గరి నుంచి మోచేయి వంచకుండా బౌల్‌ ఎలా చేయాలన్న అంశం వరకూ చాలా ‘మెళకువ’లను నేర్పే ప్రయత్నం చేశాడు. 
స్టెయిన్‌ కూడా ఏమీ తక్కువ తినలేదు. ఏమీ తెలియనట్లే అమాయకుడిలా.. ఆ కుర్రాడు చెప్పిన వాటికల్లా తలూపాడు.. బంతి విసిరే సమయంలో మోచేతిని వంచకూడదని, ఓసారి బౌన్స్ అయితే స్టంప్స్ వరకు వెళ్లాలని  ఆ కుర్రాడు సూచించినా అలాగే సర్‌ అన్నంత పని చేసి బౌలింగ్‌ చేశాడు.  తెగ కష్టపడతూ విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్టెయిన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అవతలి వ్యక్తికి తను ఎవరో చెప్పకుండా  హుందాగా ప్రవర్తించాడని ప్రశంసిస్తున్నారు.

ఎన్నో ఘనతలు..
2004లో ఇంగ్లండ్ పై టెస్ట్ మ్యాచ్‌తో డేల్ స్టెయిన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20 మ్యాచులు ఆడిన డేల్ స్టెయిన్.. మూడు ఫార్మాట్లలో కలిపి 699 వికెట్లు తీశాడు.

దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటికి స్టెయిన్ పేరిటే ఉంది. అంతేకాకుండా 2008 నుంచి 2014 వరకు ఏకంగా 263 వారాల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెం1  బౌలర్ గా స్టెయిన్ కొనసాగాడు. భారత్‌తో 2010లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో

2008లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఈ సఫారీ దిగ్గజం నిలిచాడు. అదే విధంగా 2013లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత బౌలింగ్ కోచ్‌గా, కామెంటేటర్‌గా కొనసాగతున్నాడు.
చదవండి: T20 WC 2024: పాక్‌ను దెబ్బ కొట్టింది మనోళ్లే.. ఎవరీ నేత్రావల్కర్‌?

I haven’t laughed this hard in a long time. Imagine giving bowling tips to Dale Steyn 😂😂😂😂😂 pic.twitter.com/idqw2jvW5n

— simmi (@simmiareff) June 6, 2024

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)