Breaking News

అండర్‌–19 వరల్డ్‌కప్‌నకు అమెరికా

Published on Sun, 08/17/2025 - 04:17

దుబాయ్‌: వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అండర్‌–19 పురుషుల ప్రపంచకప్‌నకు అమెరికా జట్టు అర్హత సాధించింది. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నమెంట్‌కు అమెరికా... చివరిదైన 16వ జట్టుగా ఎంపికైంది. ఇటీవలి కాలంలో సీనియర్‌ స్థాయిలో చక్కటి ప్రదర్శన కనబరుస్తూ అందరి ప్రశంసలు దక్కించుకుంటున్న అమెరికా... ఇప్పుడు జూనియర్‌ స్థాయిలోనూ సంచలనాలు రేపేందుకు సిద్ధమైంది. 

2024లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్‌–19 ప్రపంచకప్‌లో పాల్గొన్న టాప్‌–10 జట్లు నేరుగా ఈ సారి బరిలోకి దిగనుండగా... ఆతిథ్య హోదాలో జింబాబ్వే వరల్డ్‌కప్‌ ఆడనుంది. మిగిలిన ఐదు జట్లను వేర్వేరు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌ల ద్వారా ఎంపిక చేశారు. తాజాగా అమెరికా అర్హత టోర్నీలో అదరగొట్టింది. బెర్ముడా, అర్జెంటీనా, కెనడాపై విజయాలు సాధించి... మరో మ్యాచ్‌ మిగిలుండగానే వరల్డ్‌కప్‌ బెర్త్‌ పట్టేసింది. 

జార్జియా వేదికగా డబుల్‌ రౌండ్‌రాబిన్‌ పద్ధతిలో జరుగుతున్న క్వాలిఫయింగ్‌ టోర్నీలో అర్జున్‌ మహేశ్‌ సారథ్యంలోని అమెరికా జట్టు చివరి మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో కెనడాపై విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది.  

2026 అండర్‌–19 పురుషుల ప్రపంచకప్‌లో పాల్గొననున్న జట్లు 
జింబాబ్వే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, జపాన్, స్కాట్లాండ్, టాంజానియా, అమెరికా.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)