Breaking News

టాప్‌-2కు దూసుకొచ్చిన న్యూజిలాండ్‌.. మ‌రి టీమిండియా?

Published on Mon, 12/22/2025 - 11:49

మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో వెస్టిండీస్‌ను 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. 462 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కరేబియన్ జట్టు చతికల పడింది. దీంతో మూడు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ ఫలితంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విజయంతో కివీస్ జట్టు పాయింట్ల పట్టికలో భారత్‌,  దక్షిణాఫ్రికా లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుత సైకిల్‌లో న్యూజిలాండ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించగా.. మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కివీస్ ఖాతాలో ప్ర‌స్తుతం 28 పాయింట్ల ఉండ‌గా.. పీసీటీ మాత్రం 77.78గా ఉంది.

టాప్‌లో ఆస్ట్రేలియా..
డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27 ఆస్ట్రేలియా ఆధిపత్యం కొన‌సాగుతోంది. అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన యాషెస్ మూడో టెస్టులో 82 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌.. పాయింట్ల ప‌ట్టిక‌లో త‌మ అగ్ర‌స్ధానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది. ప్ర‌స్తుత సైకిల్‌లో ఆసీస్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ఆరు మ్యాచ్‌ల‌లోనూ విజ‌యం సాధించింది. 

కంగారుల ఖాతాలో 72 పాయింట్లు ఉండ‌గా.. పీసీటీ మాత్రం వంద శాతంగా ఉంది. సౌతాఫ్రికా మూడో స్ధానంలో ఉండ‌గా.. శ్రీలంక‌, పాకిస్తాన్ త‌ర్వాత స్ధానాల్లో ఉన్నాయి. ఇక ద‌క్షిణాఫ్రికా చేతిలో సిరీస్ ఓట‌మి చ‌విచూసిన టీమిండియా 48.15 శాతంతో ఆరో స్థానానికి పడిపోయింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తమ‌ తదుపరి మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ (16.67%), వెస్టిండీస్ (4.17%) చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: ఇన్నాళ్లు దాగున్న రహస్యం: తండ్రైన టీమిండియా క్రికెటర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)