Breaking News

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక టాప్‌లో ఆస్ట్రేలియా.. మరి టీమిండియా?

Published on Tue, 07/15/2025 - 17:05

లార్డ్స్ టెస్టులో భార‌త్‌పై ఇంగ్లండ్ సంచ‌ల‌న విజ‌యం, జ‌మైకాలో జ‌రిగిన మూడో టెస్టులో వెస్టిండీస్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేయ‌డంతో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 పాయింట్ల ప‌ట్టిక‌లో 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు టెస్టు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులను అల‌రించాయి. లార్డ్స్ వేదిక‌గా ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మూడో టెస్టులో భార‌త్‌పై 22 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించ‌గా.. జ‌మైకాలో జ‌రిగిన మూడో టెస్టులో వెస్టిండీస్‌ను 176 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.  

204 పరుగుల ల‌క్ష్య చేధ‌న‌లో ఆసీస్ బౌల‌ర్ల ధాటికి విండీస్ కేవ‌లం 29 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో రెండో అత్య‌ల్ప స్కోర్ చేసిన జ‌ట్టుగా విండీస్ రికార్డుల‌కెక్కింది. మ‌రోవైపు భార‌త్ మాత్రం ఆఖ‌రి వ‌ర‌కు పోరాడి ఓట‌మి పాలైంది. ఈ రెండు ఫలితాల‌తో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ 2025-27 పాయింట్ల ప‌ట్టిక‌లో మార్పులు చోటు చేసుకున్నాయి.

టాప్‌లో ఆసీస్‌..
ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా 100 విజ‌య శాతం, 36 పాయింట్ల‌తో డ‌బ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. అదేవిధంగా లార్డ్స్ టెస్టులో ఓట‌మి భార‌త జ‌ట్టుపై గ‌ట్టిప్ర‌భావాన్ని చూపింది.

ఈ ఓట‌మితో పాయింట్ల ప‌ట్టిక‌లో టీమిండియా(33.33 విజ‌య శాతం) నాలుగో స్ధానానికి ప‌డిపోయింది. అయితే ఈ టెస్టుకు ముందు  50 శాతంతో నాలుగో స్దానంలో ఉన్న ఇంగ్లండ్‌.. ఇప్పుడు 66.67 విజ‌య‌శాతంతో భారత్‌ను వెనక్కి నెట్టి రెండో  స్ధానానికి దూసుకెళ్లింది.

శ్రీలంక‌తో స‌మానంగా విజ‌యం శాతం ఉన్న‌ప్ప‌టికి పాయింట్ల ప‌రంగా ఇంగ్లండ్ ముందుంజ‌లో ఉండ‌డంతో రెండో స్ధానానికి చేరుకుంది. మూడో స్ధానంలో శ్రీలంక కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ఖాతాలో 24 పాయింట్లు ఉండ‌గా.. శ్రీలంక వ‌ద్ద 16 పాయింట్లు ఉన్నాయి.
చదవండి: IND vs ENG: భార‌త్‌తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్ రీఎంట్రీ

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)