Breaking News

భారత షూటింగ్‌ లీగ్‌కు అనూహ్య స్పందన

Published on Thu, 06/26/2025 - 02:41

న్యూఢిల్లీ: భారత షూటింగ్‌ లీగ్‌ (ఎస్‌ఎల్‌ఐ)లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా షూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ లీగ్‌ కోసం ఇప్పటి వరకు దేశవిదేశాలకు చెందిన 400 మందికి పైగా షూటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) బుధవారం వెల్లడించింది. ఇందులో కజకిస్తాన్, రష్యా, ఇరాన్, హంగేరి, క్రొయేషియా, అజర్‌బైజాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రెనెడా, ఇటలీ, ఆ్రస్టేలియా, ఆ్రస్టియా, సెర్బియా, అమెరికా, స్పెయిన్, థాయ్‌లాండ్, జర్మనీ, చెక్‌ రిపబ్లిక్, నార్వే, సాన్‌ మారినో, రొమానియా దేశాలకు చెందిన షూటర్లు ఉన్నారు. 

తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు కాళికేశ్‌ నారాయణ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ‘ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న భారత షూటింగ్‌ లీగ్‌ పై స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాం. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేవిధంగా సహృద్భావ వాతావరణంలో పోటీలు నిర్వహిస్తాం’ అని అన్నారు. జూలై వరకు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుందని  వెల్లడించారు. 

నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 2 వరకు ఎస్‌ఎల్‌ఐ తొలి సీజన్‌ జరిగే అవకాశం ఉంది. లీగ్‌లో పిస్టల్‌ విభాగంలో 10 మీటర్లు, 25 మీటర్లు... రైఫిల్‌ విభాగంలో 10 మీటర్లు, 50 మీటర్లు, ‘త్రీ’ పొజిషన్‌... షాట్‌గన్‌ విభాగంలో ట్రాప్, స్కీట్‌లో పోటీలు నిర్వహించనున్నారు. లీగ్‌లో కనీసం ఆరు జట్లు పాల్గొననుండగా... రెండు గ్రూప్‌లుగా విభజించి పోటీలు చేపట్టనున్నారు. ఆటగాళ్లను ఎలైట్‌ చాంపియన్స్, వరల్డ్‌ ఎలైట్, నేషనల్‌ చాంపియన్స్, యూత్‌ చాంపియన్స్‌ అనే నాలుగు కేటగిరీల్లో విభజించనున్నారు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)