Breaking News

న్యూజిలాండ్‌ చిత్తు చిత్తు.. భారత్‌ హ్యాట్రిక్‌ విజయం

Published on Sat, 01/24/2026 - 21:11

బులావాయో::  ఐసీసీ అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో భారత్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం నమోదు చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దాంతో ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 36.2 ఓవర్లలో  135 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆపై 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 13.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌లో విజేతను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో నిర్ణయించారు. 

 ఫలితంగా భారత్‌ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయాన్ని అందుకుంది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత్‌ 17 ఓవర్లలో 90 పరుగులు చేస్తే విజయం సాధించినట్లు. దాంతో భారత్‌ అప్పటికే ముందంజలో ఉండటంతో విజయం అడ్డుకోవడానికి కివీస్‌కు ఎటువంటి చాన్స్‌ లేకుండా పోయింది. 

భారత బ్యాటర్లలో వైభవ్‌ సూర్యవంశీ(40: 23 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి విజృంభించి ఆడాడు. అతనికి జతగా కెప్టెన్‌ ఆయుష్‌(53: 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో భారత్‌ స్కోరు 9.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటేసింది. అంతకుముందు భారత బౌలర్లలో అంబ్రిష్‌ నాలుగు వికెట్లతో కివీస్‌ పతనాన్ని శాసించగా, హెనిల్‌ పటేల్‌ మూడు వికెట్లతో మెరిశాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)