Breaking News

ఆస్ట్రేలియాతో ఫైనల్‌.. టీమిండియా టార్గెట్‌ ఎంతంటే..?

Published on Sun, 02/11/2024 - 17:21

అండర్‌ 19 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో హర్జస్‌ సింగ్‌ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ​ డిక్సన్‌ (42), హగ్‌ వెబ్జెన్‌ (48), ఒలివర్‌ పీక్‌ (46 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

సామ్‌ కాంస్టాస్‌ 0, ర్యాన్‌ హిక్స్‌ 20, రాఫ్‌ మెక్‌మిలన్‌ 2, చార్లీ ఆండర్సన్‌ 13 పరగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్‌ లింబాని 3 వికెట్లతో చెలరేగగా.. నమన్‌ తివారి 2, సౌమీ పాండే, ముషీర్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్‌ త్రయం ఉదయ్‌ సహారన్‌, ముషీర్‌ ఖాన్‌, సచిన్‌ దాస్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఈ ముగ్గురు రాణిస్తే టీమిండియా గెలుపు నల్లేరుపైనడక అవుతుంది. 

ఈ టోర్నీ ప్రస్తుత ఎడిషన్‌లో భారత్‌ అజేయ జట్టుగా ఉంది. ఈసారి యువ భారత్‌ టైటిల్‌ను గెలిస్తే ఆరో సారి జగజ్జేతగా అవతరిస్తుంది. ఆస్ట్రేలియా సైతం మూడుసార్లు వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. టీమిండియా ఈసారి కూడా టైటిల్‌ గెలవాలని ఆశిద్దాం. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)