Breaking News

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌!

Published on Sun, 04/30/2023 - 11:54

ఆస్ట్రేలియాతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు జస్ప్రీత్‌ బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ దూరం.. ఇప్పుడు మరో కీలక పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ గాయపడ్డాడు. ఉమేశ్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైటరైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ మోకాలికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ఉమేష్ దూరమయ్యాడు. అతడు ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమయ్యే ఛాన్స్‌ ఉంది. ఒక వేళ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఉమేష్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోతే భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. 

ఇక లండన్‌ ఓవల్‌ వేదికగా జూన్‌7 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది. ఇప్పటికే ఇరు క్రికెట్‌ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. భారత జట్టులో అనూహ్యంగా వెటరన్‌ ఆటగాడు అజింక్యా రహానేకు చోటు దక్కింది.

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్షిప్‌ 2021-23 ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఉనద్కత్‌
చదవండి:Ind Vs Aus WTC 2023: టీమిండియా ఆల్‌రౌండర్‌కు బంపరాఫర్‌.. పాపం సూర్యకుమార్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)