Breaking News

"ఉమేశ్‌ అన్న ముందే చెప్పాడు.. నిజం చేశాడు కదా"

Published on Sun, 03/27/2022 - 10:20

ఐపీఎల్‌-2022లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ బోణీ కొట్టింది. వాంఖడే వేదికగా జరిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా కేకేఆర్‌ విజయంలో ఆ జట్టు పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ కీలకపాత్ర పోషించాడు. ఓపెనర్లు రుత్‌రాజ్ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వేను ఔట్‌ చేసి చెన్నై జట్టును ఉమేశ్‌ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఉమేశ్‌ యాదవ్‌.. రెండు వికెట్లు పడగొట్టి 20 పరుగులు ఇచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో తన సత్తా ఏంటో చూపిస్తానని ఉమేశ్‌ యాదవ్‌ ముందే చెప్పాడు.

అయితే ఈ మ్యాచ్‌లో అది నిజం చేసి చూపించిన యాదవ్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. "ఉమేశ్‌ అన్న ముందే చెప్పాడు.. అది నిజం చేశాడు" అంటూ కామెంట్‌ చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌​ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ధోని (50) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి కోల్‌కతా 4 వి​కెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లలో రహానే 44 పరుగులతో రాణించాడు.ఈ మ్యాచ్‌లో ఉమేశ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌!

Videos

ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన

అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..

గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!

జమ్మూలోని సరిహద్దు గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

స్పీడ్ పెంచిన మెగా స్టార్.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు

రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు

ఉగ్రవాదులతోనే మా పోరాటం

భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా

దేశంలో 32 విమానాశ్రయాలు రీఓపెన్

బాహుబలి చేప

Photos

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

పెళ్లయి 13 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ స్నేహ ఇలా (ఫొటోలు)

+5

గంగమ్మ జాతరలో మంచు మనోజ్ దంపతులు (ఫొటోలు)

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)