Breaking News

ఆ స్టార్‌ ఆటగాడిని జట్టు నుంచి తప్పించలేదు.. బీసీసీఐ క్లారిటీ!

Published on Mon, 06/26/2023 - 15:53

వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో భారత వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌కు చోటు దక్కకపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ నుంచి బీజీగా గడుపతున్న మహ్మద్‌ షమీకీ సెలక్టర్లు కావాలనే విండీస్‌ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది వరల్డ్‌కప్‌ సమయానికి అతడిని ఫిట్‌నెస్‌గా ఉంచేందకు సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో అంతగా అకట్టుకోపోయిన ఉమేశ్‌ యాదవ్‌ను ఉద్దేశపూర్వకంగానే జట్టు నుంచి తప్పించారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. ఉమేశ్‌ కావాలని తప్పించలేదని, అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడని అందుకే విండీస్‌ టూర్‌కు పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

"ఉమేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతడు ఇంకా సెలక్టర్లు దృష్టిలో ఉన్నాడు" అని బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్‌ ఇండియాతో పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు భారత్‌ తరపున 57 టెస్టులు ఆడిన ఉమేశ్‌.. 170 వికెట్లు పడగొట్టాడు.

విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కెఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.
చదవండి: Andrew Strauss: ఇంతటి విషాదం దాగుందా! పాపం.. పిల్లల ముద్దూముచ్చట చూడకుండానే.. మళ్లీ పెళ్లి చేసుకోకుండానే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)