Breaking News

వరుసగా రెండో మ్యాచ్‌లో విండీస్‌ ప్రతాపం

Published on Wed, 06/07/2023 - 12:35

వెస్టిండీస్‌ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో పసికూన యూఏఈపై ప్రతాపం చూపించింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విండీస్‌.. నిన్న (జూన్‌ 6) జరిగిన రెండో వన్డేలో 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కరీబియన్‌ టీమ్‌.. ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (70 బంతుల్లో 64; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్‌ చార్లెస్‌ (47 బంతుల్లో 63; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), చివర్లో ఓడియన్‌ స్మిత్‌ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 49.5 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బౌలర్లలో జహూర్‌ ఖాన్‌ 3.. అఫ్జల్‌ ఖాన్‌, సంచిత్‌ శర్మ, అలీ నసీర్‌ తలో 2 వికెట్లు, ఆదిత్య షెట్టి ఓ వికెట్‌ పడగొట్టారు.

307 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ.. 95 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బాసిల్‌ అహ్మద్‌ (49), అలీ నసీర్‌ (57), అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ (25 నాటౌట్‌) ఆదుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యూఏఈ.. ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్‌ బౌలర్లలో హాడ్జ్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో 2 వికెట్లు.. అకీమ్‌ జోర్డన్‌, ఓడియన్‌ స్మిత్‌, యాన్నిక్‌ కారియా తలో వికెట్‌ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య జూన్‌ 9న నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.

చదవండి: పసికూనపై విండీస్‌ ప్రతాపం.. శతక్కొట్టిన కింగ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)