Breaking News

గర్జించిన ఆఫ్ఘన్‌ సింహాలు.. తోక ముడిచిన పాకిస్తాన్‌

Published on Wed, 09/03/2025 - 07:36

ఆసియా ఖండంలో టీమిండియా తర్వాత రెండో అత్యుత్తమ క్రికెట్‌ జట్టు ఏదనే అంశంపై గత కొంతకాలంగా డిబేట్స్‌ నడుస్తూ ఉన్నాయి. చాలామంది ఆ స్థానం శ్రీలంక లేదా పాకిస్తాన్‌ జట్లదిగా భావిస్తుంటారు.

అయితే ఈ భావన తప్పని ఆఫ్ఘనిస్తాన్‌ గతకొంతకాలంగా నిరూపిస్తూ వస్తుంది. పాక్‌, శ్రీలంక జట్లను ఇటీవలికాలంలో చాలాసార్లు ఓడించి, ఆసియాలో టీమిండియా తర్వాత తామే తోపులమని రుజువు చేసుకుంది.

అయినా ఎక్కడో, ఏ మూలనో ఆఫ్ఘనిస్తాన్‌ సామర్థ్యంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అలాంటి వారికి తాజా ఉదంతం శాశ్వత సమాధానమిచ్చింది. ఆసియాలో టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తానే అత్యుత్తమ జట్టని ఈ ఉదంతంతో తేటతెల్లమైంది.

యూఏఈ ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ పాక్‌ను చిత్తుగా ఓడించింది. అన్ని విభాగాల్లో పాక్‌ కంటే మెరుగైన ప్రదర్శనలు చేసి ఆసియాలో నంబర్‌-2 తామేనని మరోసారి రజువు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో రాణించి, ఆతర్వాత తమ ప్రధాన బలమైన బౌలింగ్‌లో చెలరేగి ఓ మోస్తరు లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది.

ఈ దెబ్బతో ఆసియా నంబర్‌-2 జట్టేదన్న డిబేట్‌కు పుల్‌ స్టాప్‌ పడింది. టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తానే తోపని నిరూపితమైంది. ఇంకా క్లారిటీ రావాలంటే ఆసియా కప్‌ వరకు వేచి చూడాలి. ఆ ఖండాంతర టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్‌.. భారత్‌ సహా పాక్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర జట్లను ఎదుర్కోనుంది. అక్కడ కూడా ఇదే ఫలితం పునరావృతమైతే ఆసియాలో నంబర్‌ 2 జట్టేదన్న డిస్కషన్‌ ఆపై జరుగదు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. షార్జా వేదికగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ పాక్‌ను 18 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. సెదీఖుల్లా అటల్‌ (64), ఇబ్రహీం జద్రాన్‌ (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో ఫహీమ్‌ అష్రాఫ్‌ (4-0-27-4) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.

అనంతరం ఆఫ్ఘన్‌ బౌలర్లు చెలరేగడంతో పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫజల్‌ హక్‌ ఫారూకీ, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ నబీ, నూర్‌ అహ్మద్‌ తలో 2 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో పదో నంబర్‌ ఆటగాడు హరీస్‌ రౌఫ్‌ చేసిన 34 పరుగులే అత్యధికం.

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)