Breaking News

Ind vs Aus: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ గెలుపు

Published on Thu, 10/03/2024 - 10:15

IND U-19 Vs AUS U-19 Test Series: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో అండర్‌-19 అనధికారిక టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. చెన్నై వేదికగా తొలి టెస్టులో యువ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సొంతగడ్డపై జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది.

కాగా ఓవర్‌నైట్‌ స్కోరు 110/4తో బుధవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా అండర్‌–19 జట్టు 67.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. రిలీ కింగ్‌సెల్‌ (48; 7 ఫోర్లు, ఒక సిక్స్‌) ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌ కాగా... ఎయిడెన్‌ ఓ కానర్‌ (38 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. ఇక యువ భారత బౌలర్లలో లెగ్‌స్పిన్నర్‌ మహమ్మద్‌ ఇనాన్‌ ఆరు వికెట్లతో చెలరేగాడు.

మరోవైపు.. కెప్టెన్‌ సొహమ్‌ పట్వర్ధన్‌ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువభారత్‌ అద్భుత ‍ప్రదర్శనతో ఆకట్టుకుంది. 61.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి జయభేరి మోగించింది.

అయితే, తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో వైభవ్‌ సూర్యవంశీ (1) విఫలం కాగా.. నిత్య పాండ్యా (86 బంతుల్లో 51; 3 ఫోర్లు), నిఖిల్‌ కుమార్‌ (71 బంతుల్లో 55 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఛేజింగ్‌లో ఒత్తిడి పెరిగిపోతున్న సమయంలో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన నిఖిల్‌ కుమార్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. 

ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఎయిడెన్‌ ఓ కానర్‌ నాలుగు, విశ్వ రామ్‌కుమార్‌ మూడు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి రెండో అనధికారిక టెస్టు మొదలు కానుంది.   

చదవండి: ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)