Breaking News

Ind vs Pak: ఆఖరి వరకు పోరాడిన యువ భారత్.. పాక్‌ చేతిలో తప్పని ఓటమి

Published on Sat, 11/30/2024 - 18:26

అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. లీగ్‌ దశలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌తో తలపడ్డ పాక్‌..  44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 

షాజైబ్‌ ఖాన్‌ భారీ శతకం
ఓపెనర్లలో ఉస్మాన్‌ ఖాన్‌హాఫ్‌ సెంచరీ(60)తో మెరవగా.. షాజైబ్‌ ఖాన్‌ భారీ శతకం బాదాడు.  మొత్తంగా 147 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 159 పరుగులు సాధించాడు.

ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన మహ్మద్‌ రియాజుల్లా 27 రన్స్‌ చేయగా.. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా డబుల్‌ డిజిట్‌ స్కోరు చేయలేదు. అయితే, ఓపెనర్లు​ వేసిన బలమైన పునాది కారణంగా పాకిస్తాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 281 పరుగులు స్కోరు చేసింది.

భారత బౌలర్లలో పేసర్లు సమర్థ్‌ నాగరాజ్‌ మూడు, యుధాజిత్‌ గుహ ఒక వికెట్‌ పడగొట్టగా.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆయుశ్‌ మాత్రే రెండు, కిరణ్‌ చోర్మలే ఒక వికెట్‌ తమ ఖాతాలో జమచేసుకున్నారు. అయితే, లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే భారీ షాకులు తగిలాయి.

ఆదిలోనే ఎదురుదెబ్బ
ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఒక్క పరుగుకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆండ్రీ సిద్దార్థ్‌ 15 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే 20 పరుగులుతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ మొహ్మద్‌ 16 పరుగులకు నిష్క్రమించాడు. ఇక 82 పరుగులకే జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నిఖిల్‌ కుమార్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

 

నిఖిల్‌ వీరోచిత అర్ధ శతకం
ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన నిఖిల్‌ 77 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 67 రన్స్‌ చేశాడు. అయితే, నవీద్‌ అహ్మద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో నిఖిల్‌ స్టంపౌట్‌ కావడంతో యువ భారత్‌ విజయానికి దూరమైంది. మిగతా వాళ్లలో కిరణ్‌(20), వికెట్‌ కీపర్‌ హర్వన్ష్‌ సింగ్‌(26) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. ఆఖర్లో మొహ్మద్‌ ఇనాన్‌ పోరాటపటిమ కనబరిచాడు. 

చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగా
చేతిలో ఒకే ఒక వికెట్‌ ఉన్న సమయంలోనూ చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగా బ్యాట్‌ ఝులిపించాడు. ఈ టెయిలెండర్‌ 22 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. 

అయితే, దురదృష్టవశాత్తూ యుధాజిత్‌ గుహ(12*)తో సమన్వయలోపం కారణంగా ఇనాన్‌ రనౌట్‌ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. 47.1 ఓవర్లలో 237 పరుగులకు అమాన్‌ సేన ఆలౌట్‌ అయింది.

ఫలితంగా పాకిస్తాన్‌ 44 పరుగుల తేడాతో గెలుపొంది ఈ వన్డే టోర్నీని విజయంతో ఆరంభించింది. ఇక పాక్‌ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు తీయగా.. అబ్దుల్‌ సుభాన్‌, ఫాహమ్‌ ఉల్‌ హఖ్‌ రెండేసి వికెట్లు కూల్చారు. నవీద్‌ అహ్మద్‌ ఖాన్‌, ఉస్మాన్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

తదుపరి జపాన్‌తో
ఇదిలా ఉంటే.. భారత్‌ తమ రెండో మ్యాచ్‌లో జపాన్‌తో డిసెంబరు 2న తలపడనుంది. మరోవైపు.. అదే రోజు పాకిస్తాన్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో మ్యాచ్‌ ఆడుతుంది.

చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)