Breaking News

అభిజ్ఞాన్ డబుల్‌ సెంచరీ.. టీమిండియా ఘన విజయం

Published on Tue, 12/16/2025 - 18:47

అండర్-19 ఆసియా కప్ 2025లో భారత యువ జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. మంగళవారం దుబాయ్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 315 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 409 పరుగుల లక్ష్య చేధనలో మలేషియా 32.1 ఓవర్లలో కేవలం 93 పరుగులకే కుప్పకూలింది. 

దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లతో ప్రత్యర్ది జట్టు పతనాన్ని శాసించగా.. ఉద్దవ్‌ మోహన్‌ రెండు, ఖిలాన్‌ పటేల్‌, కనిష్క్‌ చౌహన్‌ తలా వికెట్‌ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంజా పంగి 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అభిజ్ఞాన్ డబుల్‌ సెంచరీ..
ఇక టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్ అండర్-19 జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిజ్ఞాన్ కుందు అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. 125 బంతులు ఆడిన అభిజ్ఞాన్ 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 209 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

అతడితో పాటు వేదాంత్ త్రివేది (106 బంతుల్లో 90 పరుగులు), వైభవ్ సూర్యవంశీ (50 పరుగులు)  హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వేదాంత్, అభిజ్ఞాన్ నాలుగో వికెట్‌కు ఏకంగా 209 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  మలేషియా బౌలర్ మొహమ్మద్ అక్రమ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2026: రూ.30 ల‌క్ష‌ల‌తో ఎంట్రీ.. క‌ట్ చేస్తే! ఏకంగా రూ.14.20 కోట్లు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)