Breaking News

Ind vs Pak: భారత క్రికెట్‌ జట్టుకు నిరాశ.. సెమీస్‌ చేరాలంటే..

Published on Mon, 12/11/2023 - 08:29

India U19 vs Pakistan U19- దుబాయ్‌: ఆసియా కప్‌ అండర్‌–19 క్రికెట్‌ టోర్నీలో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసింది.

భారత బ్యాటర్లలో ఆదర్శ్‌ సింగ్‌ (62; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఉదయ్‌ (60; 5 ఫోర్లు), సచిన్‌ (58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం పాకిస్తాన్‌ 47 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 263 పరుగులు చేసి గెలిచింది. అజాన్‌ అవైస్‌ (105 నాటౌట్‌; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో పాక్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇక షాజైబ్‌ ఖాన్‌ (63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాద్‌ బేగ్‌ (68 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కాగా భారత్‌తో పాటు గ్రూప్‌-ఏలో ఉన్న పాక్‌ యువ క్రికెట్‌ జట్టుకు ఇది రెండో విజయం. ఇప్పటికే నేపాల్‌పై  ఏడు వికెట్ల తేడాతో దేవ్‌ ఖనాల్‌ బృందం గెలుపొందింది.

సెమీస్‌ చేరాలంటే
భారత జట్టు సెమీఫైనల్‌ చేరాలంటే మంగళవారం నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. ఇక ఈ మ్యాచ్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌ నంబర్‌ 2 వేదిక కానుంది. మరోవైపు.. పాకిస్తాన్‌ కూడా మంగళవారం అఫ్గనిస్తాన్‌తో పోరకు సిద్ధమవుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)