Breaking News

తమిళ్‌ తలైవాస్‌కు షాక్‌ 

Published on Mon, 09/01/2025 - 06:27

విశాఖ స్పోర్ట్స్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా ఆఖర్లో పుంజుకొని తమిళ్‌ తలైవాస్‌కు షాక్‌ ఇచ్చింది. మాజీ చాంపియన్‌ యు ముంబా 36–33 పాయింట్ల తేడాతో తలైవాస్‌ను ఓడించి ఈ లీగ్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యు ముంబా రెయిడర్‌ అజిత్‌ చౌహాన్‌ 9, ఆల్‌రౌండర్‌ అనిల్‌ 8 పాయింట్లు సాధించారు. డిఫెండర్లలో లోకేశ్, రింకూ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. తమిళ్‌ రెయిడర్‌ అర్జున్‌ దేశ్వాల్‌ 18 సార్లు కూతకెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. 

మిగతా వారిలో కెపె్టన్‌ పవన్‌ సెహ్రావత్‌ 7, డిఫెండర్లు నితీశ్‌ కుమార్, హిమాన్షు చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హరియాణా స్టీలర్స్‌కు బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో చుక్కెదురైంది. కెపె్టన్‌ దేవాంక్‌ (21) రెయిడింగ్‌లో చెలరేగడంతో 2019 చాంపియన్‌ బెంగాల్‌ 54–44తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. వారియర్స్‌ జట్టులో దేవాంక్‌తో పాటు మరో రెయిడర్‌ మన్‌ప్రీత్‌ (13) అదరగొట్టాడు. స్టీలర్స్‌ జట్టులో రెయిడర్లు శివమ్‌ పటారే (17), వినయ్‌ (13) రాణించారు.  నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధాస్, పుణేరి పల్టన్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ తలపడతాయి.  
 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)