Breaking News

IPL 2026: ఐపీఎల్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Published on Fri, 02/27/2026 - 20:35

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 టోర్నమెంట్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌!!... ముందుగా షెడ్యూల్‌ చేసినట్లుగా మార్చి 26న కాకుండా.. రెండు రోజులు ఆలస్యంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ ఆరంభం కానున్నట్లు సమాచారం.

గతేడాది ఇలా
గతేడాది మార్చి 22న మొదలైన ఐపీఎల్‌.. జూన్‌ 3న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఐపీఎల్‌-2026 టోర్నీ మార్చి 26న ఆరంభం కానుందని తొలుత పాలక మండలి ఫ్రాంఛైజీలకు తెలిపింది. డిసెంబరులో జరిగిన వేలానికి ముందు ఈ మేరకు సమాచారం అందించింది.

కారణం ఇదేనా?
అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఐపీఎల్‌ పందొమ్మిదో ఎడిషన్‌ మార్చి 28న మొదలుకానున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఫైనల్‌ను మే 31న నిర్వహించనున్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తన కథనంలో పేర్కొంది. ఐపీఎల్‌ ఆరంభ తేదీకి సంబంధించి పాలక మండలి వచ్చే వారం సమావేశమై డేట్‌ ఫిక్స్‌ చేయనున్నట్లు వెల్లడించింది.

అసోం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈమేరకు తేదీల్లో మార్పు చేసినట్లు పేర్కొంది. కాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తమిళనాడు (చెన్నై), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు పశ్చిమ బెంగాల్‌ (కోల్‌కతా) హోం గ్రౌండ్స్‌గా ఉండగా.. అసోంలోని గువాహటి రాజస్తాన్‌ రాయల్స్‌కి రెండో హోం గ్రౌండ్‌.

ఆర్సీబీకి స్టేడియం దొరికిందా?
ఇక ఐపీఎల్‌ రెండు రోజులు ఆలస్యంగా ఆరంభం కావడానికి అసెంబ్లీ ఎన్నికలు ఒక కారణం అయితే.. గత ఎడిషన్‌ విజేత ఆర్సీబీకి ఇంతవరకు తమ హోం గ్రౌండ్‌పై ఇంత వరకు స్పష్టత రానట్లు సమాచారం. కాగా మొట్టమొదటిసారి ట్రోఫీ గెలిచిన సంతోషాన్ని పంచుకునే క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం తొందరపాటు చర్య విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. 

విజయోత్సవ విషాదం
బెంగళూరులోకి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవానికి ఎలాంటి అనుమతి లేకుండా పిలుపునివ్వగా భారీ ఎత్తున అభిమానులు కదలివచ్చారు. ఈ క్రమంలో  తొక్కిసలాట జరిగి పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్సీబీ యాజమాన్యంపై కేసులు నమోదు కావడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 

దీంతో ఈసారి తమ హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి నుంచి తరలించాలని ఆర్సీబీ నిర్ణయించుకుంది. కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ వేదికల కోసం ఇప్పటికే నవీ ముంబై, రాయ్‌పూర్‌, పుణెలను ఎంచుకుని ఆయా స్థానిక బోర్డులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)