Breaking News

భారత్‌ గురికి రెండు కాంస్యాలు

Published on Fri, 08/18/2023 - 02:36

పారిస్‌: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–4 టోర్నీలో రెండో రోజూ భారత్‌ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. తొలి రోజు బుధవారం కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌ చేరి కనీసం రెండు రజతాలు ఖరారు చేసుకోగా... గురువారం రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాయి.  

ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌తోపాటు అతాను దాస్, తుషార్‌ ప్రభాకర్‌ షెలే్కలతో కూడిన భారత పురుషుల జట్టు కాంస్య పతక మ్యాచ్‌లో 6–2తో (54–56, 57–55, 56–54, 57–55) స్పెయిన్‌ జట్టుపై గెలుపొందింది. సెమీఫైనల్లో భారత్‌ 0–6తో (54–56, 47–58, 55–56) చైనీస్‌ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం పోటీపడింది.

రికర్వ్‌ ఈవెంట్‌లో మ్యాచ్‌లను ‘బెస్ట్‌ ఆఫ్‌ ఫోర్‌ సెట్స్‌’ పద్ధతిలో మ్యాచ్‌ను నిర్వహిస్తారు. సెట్‌ గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి. స్కోరు సమంగా నిలిస్తే రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ వస్తుంది. నాలుగు సెట్‌ల తర్వాత స్కోరు సమమైతే ‘షూట్‌ ఆఫ్‌’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.  

మహిళల టీమ్‌ రికర్వ్‌ కాంస్య పతక మ్యాచ్‌లో అంకిత, భజన్‌ కౌర్, సిమ్రన్‌జిత్‌ కౌర్‌లతో కూడిన భారత జట్టు ‘షూట్‌ ఆఫ్‌’లో 5–4తో (52–55, 52–53, 55–52, 54–52, 27–25) మెక్సికో జట్టును ఓడించింది. నాలుగు సెట్‌ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి.

విజేతను నిర్ణయించేందుకు ‘షూట్‌ ఆఫ్‌’ నిర్ణయించగా... భారత బృందం 27 పాయింట్లు స్కోరు చేయగా... మెక్సికో జట్టు 25 పాయింట్లు చేసి ఓడిపోయింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్‌ 0–6తో (52–57, 47–56, 52–53) చైనీస్‌ తైపీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకం కోసం ఆడింది.  

సెమీఫైనల్లో జ్యోతి సురేఖ 
మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పతకం రేసులో నిలిచింది. సురేఖ తొలి రౌండ్‌లో 145–131తో పూన్‌ చియు యి (హాంకాంగ్‌)పై, రెండో రౌండ్‌లో 148–145తో చెన్‌ లి జు (చైనీస్‌ తైపీ)పై, మూడో రౌండ్‌లో 148–145తో హువాంగ్‌ జు (చైనీస్‌ తైపీ)పై, క్వార్టర్‌ ఫైనల్లో 147–144తో డాఫ్నీ క్వింటెరో (మెక్సికో)పై నెగ్గింది.

శనివారం జరిగే సెమీఫైనల్లో ఎల్లా గిబ్సన్‌ (బ్రిటన్‌)తో సురేఖ ఆడుతుంది. ప్రపంచ చాంపియన్, భారత ప్లేయర్‌ అదితి క్వార్టర్‌ ఫైనల్లో 135–148తో ఎల్లా గిబ్సన్‌ చేతిలో ఓడింది. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)