Breaking News

#Glenn Maxwell: మ‌రి ఇంత చెత్త బ్యాటింగా? జ‌ట్టు నుంచి తీసేయండి

Published on Sat, 04/26/2025 - 22:08

ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాక్స్‌వెల్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. గ‌త మ్యాచ్‌కు దూరంగా ఉన్న మాక్సీకి పంజాబ్ మెనెజ్‌మెంట్ తిరిగి తుది జ‌ట్టులో చోటు ఇచ్చింది.

మార్క‌స్ స్టోయినిష్ స్ధానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన మాక్స్‌వెల్ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. కీల‌క స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన మాక్స్‌వెల్‌.. కేకేఆర్ బౌల‌ర్ల‌ను ఎదుర్కోవ‌డానికి ఇబ్బంది ప‌డ్డాడు. మ‌రోసారి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో మాక్సీ పెవిలియ‌న్‌కు చేరాడు. 

వ‌రుణ్ అద్బుత‌మైన బంతితో ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్‌..87.50 స్ట్రైక్ రేటుతో కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఓవ‌రాల్‌గా ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన మాక్స్‌వెల్‌.. 8.00 స‌గ‌టుతో కేవ‌లం 48 ప‌రుగులు చేశాడు. దీంతో మాక్స్‌వెల్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే చెత్త ప్లేయ‌ర్ అంటూ ఎక్స్‌లో ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌(83) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్‌(25) రాణించారు.
చ‌ద‌వండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్‌.. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు గుడ్ న్యూస్‌
 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)