Breaking News

కంటిచూపుతో...

Published on Fri, 08/02/2024 - 03:27

టీ షర్ట్‌తో క్యాజువల్‌ లుక్‌... ఎడమ చేయి ప్యాంట్‌ జేబులో... లక్ష్యాన్ని స్పష్టంగా చూసేందుకు ఎలాంటి ప్రత్యేకమైన లెన్స్‌లు లేవు, ఐ కవర్‌ లేదు, పక్కనుంచి వచ్చే కాంతి నుంచి తప్పించుకునేందుకు వైజర్‌ పెట్టుకోలేదు, ఇయర్‌ ప్రొటెక్షన్‌ లేదు. లక్ష్యంపై గురి...ట్రిగ్గర్‌పై వేలు... నొక్కితే దేశానికి రజత పతకం వచ్చేసింది! 

టర్కీ షూటర్‌ యూసుఫ్‌ డికెక్‌ ఒక్కసారిగా పారిస్‌ ఒలింపిక్స్‌లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారాడు. సాధారణంగా షూటర్లు పోటీలో దిగినప్పుడు తమతో పాటు ధరించే సరంజామా ఏదీ అతను వాడలేదు. ఏదో అలా వ్యాహ్యాళికి వెళుతూ బొమ్మ తుపాకీతో సంతలో బెలూన్లను కొట్టినంత అలవోకగా అతను బుల్లెట్‌లను దించేయడం విశేషం. 

టర్కీ ఆర్మీలో సైనికుడైన 51 ఏళ్ల యూసుఫ్‌ హాలీవుడ్‌ సినిమాల స్టయిల్‌ను గుర్తుకు తెచ్చేలా షూటింగ్‌ చేశాడంటూ కామెంట్లు రావడం విశేషం. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో తర్హాన్‌తో కలిసి యూసుఫ్‌ రజతం సాధించాడు. షూటింగ్‌లో టర్కీకి ఇదే తొలి మెడల్‌.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)