Breaking News

నైట్‌రైడర్స్‌ హెడ్‌ కోచ్‌గా సీఎస్‌కే దిగ్గజం

Published on Fri, 06/20/2025 - 13:29

త్వరలో ప్రారంభం కానున్న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 సీజన్‌ కోసం ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కేకు చెందిన దిగ్గజ ఆటగాడు డ్వేన్‌ బ్రావోను హెడ్‌ కోచ్‌గా నియమించుకుంది. ఈ మేరకు నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ ఇవాళ (జూన్‌ 20) అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత సీజన్‌ వరకు నైట్‌రైడర్స్‌కు హెడ్‌ కోచ్‌గా ఫిల్‌ సిమన్స్‌ ఉండేవాడు. సిమన్స్‌ బంగ్లాదేశ్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తుండటంతో ఈ పదవి నుంచి తప్పుకున్నాడు.

నైట్‌రైడర్స్‌ హెడ్‌ కోచ్‌గా ఎంపిక కావడంపై బ్రావో హర్షం వ్యక్తం చేశాడు. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న ఈ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా పని చేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా సిమన్స్ ఈ ఫ్రాంచైజీని అద్భుతంగా ముందుండి నడిపించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. నైట్‌రైడర్స్‌ హెడ్‌ కోచ్‌గా కొత్త సవాళ్లు స్వీకరించేందుకు సిద్దమని అన్నాడు.

బ్రావో కోచింగ్‌ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం..
2022లో ఐపీఎల్‌ నుంచి రిటైరైన బ్రావో.. కోచ్‌గా తన ప్రయాణాన్ని సీఎస్‌కేతోనే మొదలుపెట్టాడు. 2023 సీజన్‌లో అతను సీఎస్‌కే బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా పని చేశాడు. ఆతర్వాత 2024 సీజన్‌లో ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో అబుదాబి నైట్‌రైడర్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 

2025 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు కేకేఆర్‌ మెంటార్‌గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. ఈ మధ్యలో బ్రావో ఆఫ్ఘనిస్తాన్‌ జాతీయ జట్టుకు బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా పని చేశాడు. అతని ఆథ్వర్యంలో ఆ జట్టు 2024 టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌ వరకు చేరి చరిత్ర సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్‌ సాధించిన ఈ ఘనతలో బ్రావో పాత్ర చాలా కీలకంగా ఉండింది.

పొట్టి క్రికెట్‌లో దిగ్గజ ఆల్‌రౌండర్‌ అయిన బ్రావోకు స్వదేశంలో జరిగే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ లీగ్‌లో బ్రావో 107 మ్యాచ్‌ల్లో 129 వికెట్లు తీసి నేటికీ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)