Breaking News

చెల‌రేగిన సౌతాఫ్రికా బ్యాట‌ర్లు.. ఆసీస్ ముందు భారీ టార్గెట్‌

Published on Tue, 08/19/2025 - 14:00

కైర్న్స్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో సౌతాఫ్రికా బ్యాట‌ర్లు స‌మిష్టిగా క‌దం తొక్కారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 296 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రోటీస్ ఓపెన‌ర్లు ఐడైన్ మార్‌క్ర‌మ్, ర్యాన్ రికెల్ట‌న్ తొలి వికెట్‌కు 92 ప‌రుగుల ఘ‌న‌మైన ఆరంభాన్ని అందించారు. 

రికెల్ట‌న్‌(33) ఔటైన అనంత‌రం కెప్టెన్ టెంబా బావుమా(65), మార్‌క్ర‌మ్(82) స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. అయితే బెన్ ద్వార్షుయిస్ మార్‌క్ర‌మ్‌ను పెవిలియ‌న్‌కు పంప‌డం ప్రోటీస్ స్కోర్ బోర్డు కాస్త నెమ్మ‌దించింది.

అయితే ఈ స‌మ‌యంలో యువ ఆట‌గాడు మాథ్యూ బ్రీట్జ్కే(57) దూకుడుగా ఆడుతూ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగే ప్ర‌య‌త్నం చేశాడు. ఆఖ‌రిలో వియాన్ ముల్డ‌ర్‌(31) సైతం బ్యాట్ ఝూలిపించ‌డంతో ఆసీస్ ముందు ఈ భారీ స్కోర‌ర్‌ను స‌ఫారీలు ఉంచ‌గ‌లిగారు. 

ఇక ఆసీస్ బౌల‌ర్ల‌లో పార్ట్ టైమ్ స్పిన్న‌ర్ ట్రావిస్ హెడ్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బెన్ ద్వార్షుయిస్ రెండు, జంపా ఒక వికెట్ సాధించారు. మ‌రో వికెట్ ర‌నౌట్ రూపంలో ల‌భించింది.

తుది జ‌ట్లు
ఆస్ట్రేలియా
ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్‌), మార్నస్ ల‌బుషేన్‌, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీప‌ర్‌), అలెక్స్ కారీ, ఆరోన్ హార్డీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

సౌతాఫ్రికా
ఐడెన్ మార్‌క్ర‌మ్‌, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీప‌ర్‌), టెంబా బావుమా (కెప్టెన్‌), మాథ్యూ బ్రీట్జ్కే, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, లుంగి ఎంగిడి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)