Breaking News

తండ్రైన సన్‌రైజర్స్‌ విధ్వంసకర వీరుడు..

Published on Fri, 11/08/2024 - 12:10

ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్, ఎస్‌ఆర్‌హెచ్‌ విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ రెండో సారి తండ్ర‌య్యాడు. అత‌డి భార్య జెస్సికా సోమవారం పండింటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. తాజాగా ఈ శుభవార్త‌ను జెస్సికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకుంది.  తన భర్త హెడ్‌, కుమార్తె మీలా, కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను జెస్సికా షేర్ చేసింది.

హెడ్‌-జెస్సికా జోడీ తమ కుమారుడికి హారిసన్ జార్జ్ అని నామ‌క‌ర‌ణం చేశారు. "వెల్‌కమ్ టూ వరల్డ్ హారిసన్ జార్జ్ హెడ్‌" అంటూ ఆమె క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. కాగా వీరిద్దిరికి తొలి సంతానంగా 2022 ఏడాదిలో మీలా జన్మించింది.

బీజీటీతో రీఎంట్రీ?
ఇక గ‌త కొంత‌కాలంగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్న హెడ్ ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన కుటుంబంతో సమయం గ‌డిపేందుకు పాకిస్తాన్‌తో వైట్‌బాల్ సిరీస్‌ల‌కు హెడ్ దూర‌మ‌య్యాడు. అత‌డు తిరిగి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు. నవంబర్ 22న పెర్త్‌లో ఈ బీజీటీ ట్రోఫీ ప్రారంభం కానుంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌..
ఇక ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఆడిన ట్రావిస్‌ హెడ్‌ విధ్వంసకర ప్రదర్శనలు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన హెడ్‌.. 191.55 స్ట్రైక్‌ రేటుతో 567 పరుగులు చేశాడు. దీంతో హెడ్‌ను ఐపీఎల్‌​-2025 సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ చేసుకుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)