ట్రవిస్‌ హెడ్‌ ఊచకోత.. మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం

Published on Wed, 09/04/2024 - 21:09

ఎడిన్‌బర్గ్‌ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు ట్రవిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌ శివాలెత్తిపోయారు. పవర్‌ ప్లేలో (తొలి ఆరు ఓవర్లలో) రికార్డు స్థాయిలో వికెట్‌ నష్టానికి 113 పరుగులు చేశారు.  అంతర్జాతీయ టీ20 చరిత్రలో (పవర్‌ ప్లేల్లో) ఇదే అత్యధిక స్కోర్‌. 

పవర్‌ ప్లే ముగిసే సమయానికి ట్రవిస్‌ హెడ్‌ 22 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేయగా.. మిచెల్‌ మార్ష్‌ 11 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. పవర్‌ ప్లే మొత్తంలో కేవలం రెండు సింగల్స్‌ మాత్రమే రాగా.. 17 ఫోర్లు, 7 సిక్సర్లు వచ్చాయి. ట్రవిస్‌ హెడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి కేవలం 17 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లు తలో చేయి వేసి స్కాట్లాండ్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. సీన్‌ అబాట్‌ 3 వికెట్లతో రాణించగా.. జేవియర్‌ బార్ట్‌లెట్‌, ఆడమ్‌ జంపా తలో 2, రిలే మెరిడిత్‌, కెమరూన్‌ గ్రీన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో మున్సే 28, క్రాస్‌ 27, బెర్రింగ్టన్‌ 23 పరుగులు చేశారు. మిగతావారంతా తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు.

అరంగేట్రంలోనే డకౌట్‌
ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌.. తొలి మ్యాచ్‌లోనే డకౌటయ్యాడు. మెక్‌గుర్క్‌ మూడు బంతులు ఆడి బ్రెండన్‌ మెక్‌ముల్లెన్‌ బౌలింగ్‌లో చార్లీ కాసెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. 

కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదన
155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ట్రవిస్‌ హెడ్‌ (25 బంతుల్లో 80; 12 ఫోర్లు, 5 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (12 బంతుల్లో 39; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్‌ ఇంగ్లిస్‌ (13 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కేవలం 9.4 ఓవర్లలోనే (3 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)