Breaking News

ఆడమ్‌ జంపా 'డబుల్ సెంచరీ'.. జింబాబ్వేను చిత్తు చేసిన ఆసీస్‌

Published on Fri, 09/18/2026 - 21:42

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో  84 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే  2-0 తేడాతో ఆసీస్‌ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తొలుత ఆస్ట్రేలియాను బ్యాటింగ్ అహ్హనించాడు.

ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (84 బంతుల్లో 112 రన్స్ - 15 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. యంగ్ ఆల్‌రౌండర్ కూపర్ కానల్లీ (78), కెప్టెన్ మిచెల్ మార్ష్ (53) అర్ధశతకాలు సాధించారు.

ఆఖరిలో ఆలివర్ జాన్ పీక్ (18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంత‌రం 357 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే 48.3 ఓవ‌ర్ల‌లో 272 ప‌రుగుల‌కే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రెండన్ టేలర్ (39), సికందర్ రాజా (45), ఇన్నోసెంట్ కైయా (34) రాణించినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో జోష్‌ హాజిల్‌వుడ్‌, కూపర్‌ కొన్నోలీ, ఆడమ్‌ జంపా, మాట్‌ రెన్‌షా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్ ఇన్నోసెంట్ కైయా వికెట్ తీయడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని  జంపా అందుకున్నాడు. తద్వారా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో షేన్ వార్న్ (293 వికెట్లు) తర్వాత వన్డేల్లో 200 పైగా వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తరఫున వేగంగా (123 మ్యాచ్‌ల్లో) 200 వన్డే వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా షేన్ వార్న్ రికార్డును అధిగమించాడు.
చదవండి: IND vs AUS: ద్రవిడ్, సెహ్వాగ్ కొడుకుల జోరు.. ఆసీస్‌పై భారత్ సంచలన విజయం

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)